Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెచ్చిపోతే: భజ్జీ పట్ల స్లెడ్జింగ్ ఎందుకు ఆపేశారంటే..?

ముంబై: మైదానంలో హర్భజన్ సింగ్ దూకుడుగా ఉంటాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భజ్జీని వెక్కిరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఆ తర్వాత అలాంటి సంఘటనలు కనిపించడం లేదు. తనను ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేయక పోవడం వెనుక అసలు విషయాన్ని భజ్జీ వెల్లడించాడు.

భజ్జీ తన దూకుడుతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో దూకుడుగా వ్యవహరిస్తాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మరింత దూకుడుగా ఉండేవాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తనను ఎందుకు టార్గెట్ చేసుకోవడం లేదో ఓ కార్యక్రమంలో చెప్పాడు.

Harbhajan Singh

'ఓసారి డారెన్ లెహమాన్ షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. తాను ఆడుతుండగా అతను తన ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అప్పుడు బెంగళూరులో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో తాను బ్యాటింగ్ చేస్తుంటే స్లెడ్జింగ్ ద్వారా ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని' చెప్పాడు.

లెహమాన్ అలాగే మాట్లాడుతుంటే అతని కడుపు వైపు చూసిన భజ్జీ.. నీవు ప్రెగ్నెంటా అని అడిగాడు. దానికి డారెన్ లెహమాన్ అప్ సెట్ అయ్యాడు. అలాగే కామెంట్ చేయడం ప్రారంభించాడు.

ఆ తర్వాత తమ ఇన్నింగ్సులో నా స్పెల్ వేశానని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియన్ల ఏడు వికెట్లు పడగొట్టానని చెప్పాడు. అప్పుడు గ్లెన్ మెక్‌గ్రాత్ తన ఆటగాళ్లను ఉద్దేశించి.. భజ్జీని రెచ్చగొట్టవద్దని సూచించాడు. అందుకే వారు తనను స్లెడ్జింగ్ చేయడం లేదని భజ్జీ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+