హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా ప్రధాన కోచ్ ఎంపికపై హైడ్రామానే నడిచింది. మంగళవారం సాయంత్రం లోపు కొత్త కోచ్ పేరుని ప్రకటించాలని పరిపాలనా కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ బీసీసీఐని ఆదేశించిన నేపథ్యంలో గతంలో టీమిండియా మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన రవిశాస్త్రిని కోచ్‌గా నియమించారంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ వార్తలను ఖండిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎవరినీ నియమించలేదని, దానిపై క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంకా చర్చలు జరుపుతోందని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి మంగళవారం సాయంత్రం మీడియా ముఖంగా చెప్పారు.

అయితే ఆ తర్వాత అందరూ ఊహించినట్టుగానే రవిశాస్త్రి పేరునే ఖరారు చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో గతంలో టీమిండియా డైరెక్టర్‌గా పనిచేసిన రవిశాస్త్రి, ఇప్పుడు అనిల్ కుంబ్లే వారసుడిగా రవిశాస్త్రి 2019 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:
* మే 27, 1962లో ముంబైలో జన్మించాడు.
* రవిశాస్త్రి పూర్తి పేరు రవిశంకర్ జయద్రిత శాస్త్రి
* 17 ఏళ్ల వయసులోనే ముంబై రంజీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ముంబై తరఫున ఆడిన అత్యంత పిన్న వయసు ప్లేయర్‌గా రవిశాస్త్రి నిలిచాడు.
* లెఫ్టామ్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన రవి... తొలుత పదో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగేవాడు.
* అయితే అనతి కాలంలోనే మంచి బ్యాట్స్‌మన్‌గా పేరుగడించాడు. టెస్టు అరంగేట్రం చేసిన ఏడాదిన్నరలోనే ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు.
* ఇక అప్పటి నుంచి రిటైరయ్యే దాకా 1 నుంచి 10వరకూ అన్ని స్థానాల్లోనూ బ్యాటింగ్ చేశాడు. కెరీర్‌లో ప్రతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఘనత అతనిది.
* రవిశాస్త్రి కెరీర్‌లో 1985లో జరిగిన చాంపియన్స్ ఆఫ్ చాంపియన్స్ సిరీస్ ప్రత్యేకమైనది.
* ఈ సిరీస్‌లో ఇండియా ప్రతి మ్యాచ్ గెలిచింది. రవిశాస్త్రి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతను 182 పరుగులు, 8 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు. ఆడి 100 కారు అతనికి బహుమతిగా లభించింది.
* రవిశాస్త్రి కెరీర్‌లో 80 టెస్టుల్లో 3830 పరుగులు చేసి 151 వికెట్లు తీసుకున్నాడు. ఇక 150 వన్డేల్లో 3108 పరుగులు చేసి 129 వికెట్లు తీశాడు.
* అయితే మోకాలి గాయం కారణంగా 30 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.
* కామెంటేటర్‌గానూ రవిశాస్త్రి తనదైన ముద్ర వేశాడు. ఇండియా 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో రవిశాస్త్రి కామెంటేటర్‌గా చేశాడు.
* హ్యాండ్సమ్ లుక్స్‌తో ఇండియన్ క్రికెట్ పోస్టర్ బాయ్‌గా రవి మారాడు. అతనికి లేడీ ఫ్యాన్సే ఎక్కువ. అమృతాసింగ్‌తో అతని ఎఫైర్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.
* 2008లో సెలబ్రిటీ టార్చ్ బేరర్‌గా ఒమన్‌లో జరిగిన ర్యాలీలో ఒలింపిక్ టార్చ్‌ను పట్టుకున్నాడు.
* యూనిసెఫ్ నేషనల్ గుడ్‌విల్ అంబాసిడర్ అయిన తొలి క్రికెటర్ రవిశాస్త్రే. ఆ తర్వాత సచిన్ కూడా యూనిసెఫ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.