
రివ్యూ అడగకుండానే పెవిలియన్‌కు చేరిన మార్ష్
రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌శర్మ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. కానీ అతడు డీఆర్ఎస్ రివ్యూ అడగకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఇదే సమయంలో మిచెల్ మార్ష్‌కు ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సంకేతాలు అందినట్లు టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ గమనించారు.

ఓ కన్నేసి ఉంచిన టీమిండియా
ఇరు జట్ల డ్రెస్సింగ్ రూమ్స్ పక్కపక్కనే ఉండటంతో ఆస్ట్రేలియాపై టీమిండియా మేనేజ్‌మెంట్ ఓ కన్నేసి ఉంచింది. మూడో రోజు ఆటలో భాగంగా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్మిత్ అవుటైనా మైదానం నుంచి త్వరగా వెళ్లకపోవడం ఇదే పక్కా సాక్ష్యంగా మారింది. మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రత్యక్ష ప్రసారానికి కొద్ది ముందుగానే డ్రెస్సింగ్ రూమ్‌లోని సాంకేతిక సహాయ సిబ్బంది, విశ్లేషకులకు ప్రసారం అవుతాయి.
అవుటయ్యాడో లేదో ముందుగానే తెలిసే అవకాశం
దీని సాయంతో ఆటగాడు అవుటయ్యాడో లేదో ముందుగానే తెలిసే అవకాశం ఉంటుంది. జట్టు వీడియో అనలిస్ట్ లైవ్ ఫీడ్‌ను తన లాప్‌టాప్‌లో వేసుకోవడం వల్ల టీవీలో వచ్చేదానికంటే ముందే రియల్‌టైమ్‌లో దానిని గమనించే అవకాశం జట్టు మేనేజ్మెంట్ ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఆసీస్ ఆటగాళ్లు డీఆర్ఎస్ రివ్యూ కోసం బాక్సు వైపు చూస్తున్నారు.
ప్రెస్ మీట్‌లో కోహ్లీ ఇలా
రెండో టెస్టు మ్యాచ్ విజయానంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రెస్ మీట్‌లో మూడు రోజుల నుంచి డీఆర్ఎస్ రివ్యూల విషయంలో మోసం చేస్తోందని వ్యాఖ్యానించడం వెనుక కారణమిదేనని స్పష్టమవుతోంది. ఇక బెంగుళూరు టెస్టులో తాను అలా చేసి ఉండాల్సింది కాదని, కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా అలా వ్యవహరించకూడదని స్మిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఏకాగ్రత కోల్పోయి అలా చేశానన్న స్మిత్
తాను ఏకాగ్రత కోల్పోయి (బ్రెయిన్ ఫేడ్) ఆ పని చేశానని స్మిత్ చెప్పినప్పటికీ ఓ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్మిత్ డీఆర్ఎస్ రివ్యూ ఘటనపై ఐసీసీకి సైతం బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో స్టీవ్ స్మిత్, కోహ్లీపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఐసీసీ బుధవారం అధికారిక ప్రకటించడం విశేషం.


Click it and Unblock the Notifications











