Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా సమయం ముగిసింది.. ఇక నేను వెళ్లాలి: మలింగ

Lasith Malinga Retires:Lasith Malinga says 'Right time for me to retire from ODIs'
Retires from ODIS: My time is over and I have to go says Lasith Malinga

కొలంబో: యార్కర్ల కింగ్, శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో మలింగ బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. వన్డేల నుండి కూడా తప్పుకున్నాడు. మలింగ కేవలం టీ20లు మాత్రమే ఆడనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు ఆడుతాడు.

నా సమయం ముగిసింది:

నా సమయం ముగిసింది:

బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ అనంతరం మలింగ మాట్లాడుతూ... 'వన్డేల నుంచి రిటైర్‌ అవ్వడానికి ఇదే సరైన సమయం అనిపించింది. గత 15 సంవత్సరాలుగా శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించా. లంక విజయాల కోసం కెరీర్‌లో నా వంతు ప్రయత్నం చేశా. నా సమయం ముగిసింది. ఇక నేను వెళ్లాలి' అని మలింగ పేర్కొన్నాడు.

ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్ కావాలి:

ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్ కావాలి:

'లంక జట్టులో కొంతమంది యువ బౌలర్లు మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. యువ బౌలర్లు మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్‌ను ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ జట్టుకు మ్యాచ్ విన్నర్ కావాలి' అని మలింగ సలహా ఇచ్చాడు. 'నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా సహచర ఆటగాళ్లకు, జట్టు సిబ్బందికి ధన్యవాదాలు. భవిష్యత్తులో లంక మంచి విజయాలు సాదించాలని' అని మలింగ కోరుకున్నాడు.

చివరి బంతికి కూడా వికెట్:

చివరి బంతికి కూడా వికెట్:

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 91 పరుగుల తేడాతో విజయం సాధించి మలింగకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మ్యాచ్‌లో మలింగ 9.4 ఓవర్లు వేసి కేవలం 38 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బంగ్లా ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్‌.. ముస్తాఫిజుర్ రెహమాన్ వికెట్లను పడగొట్టాడు. వన్డే కెరీర్ చివరి బంతికి కూడా వికెట్ తీయడం విశేషం.

226 వన్డేలు 338 వికెట్లు:

226 వన్డేలు 338 వికెట్లు:

2004లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరఫున మురళీధరన్ (534), వాస్ (400) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2007, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తన 15 ఏళ్ల వన్డే ప్రయాణంలో ఎన్నో రికార్డులను అందుకున్నాడు. వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసాడు.ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడు మలింగ. 29 మ్యాచుల్లో 56 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, July 27, 2019, 16:22 [IST]
Other articles published on Jul 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+