Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో మళ్లీ ఆడతా: రిటైర్డ్ ఆస్టేలియా ఆటగాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆస్టేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తెలిపాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరిస్ అనంతరం గత ఆదివారం అంతర్జాతీయ క్రికెట్‌కు మైఖెల్ క్లార్క్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఆస్టేలియా క్రికెట్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మైఖెల్ క్లార్క్ మాట్లాడుతూ మళ్లీ క్రికెట్ అడటానికి ఐపీఎల్ పునరాగమనంపై గల అవకాశాలను పరిశీలిస్తానని క్లార్క్ తెలిపాడు. 2012 ఐపీఎల్‌లో పూణె ప్రాంచైజీ తరుపున ఆడిన క్లార్క్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

Retired Australian batsman Michael Clarke likely to make an IPL comeback

మైఖెల్ క్లార్క్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 98 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం తాను తన భార్య క్వేలీ వారం రోజుల పాటు విహారయాత్రకు వెళ్తున్నామని తెలిపాడు. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత తన తదుపరి కార్యాచరణను వెల్లడిస్తానని మైఖెల్ క్లార్క్ తెలిపాడు.

ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ తన జీవితంలో అంతర్భాగమని క్లార్క్ తెలిపాడు. కెఎఫ్‌సీ బిగ్ బ్యాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు రెండు సంవత్సరాల పాటు మైఖెల్ క్లార్క్ తన కాంట్రాక్ట్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+