శ్రీలంకతో టీ20 సిరిస్‌కు కోహ్లీ అనుమానమే!

హైదరాబాద్: టెస్టు సిరిస్ అనంతరం శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మూడు టీ20ల సిరిస్‌కు కూడా కోహ్లీ దూరం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. లంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. అయితే ఇప్పుడు టీ20ల్లో బరిలోకి దిగుతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇందులో భాగంగానే టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయలేదని బీసీసీఐ అధికారి మంగళవారం తెలిపారు.

'డిసెంబరు 12 వరకు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండలేనని కోహ్లీ సెలక్టర్లకు తెలిపాడు. ఆ తర్వాత లంకతో టీ20ల్లో ఆడే దానిపై స్పష్టత ఇచ్చేందుకు కొంత సమయం అడిగాడు. ఆ కారణంగానే సోమవారం లంకతో తలపడే భారత టీ20 జట్టును ప్రకటించలేకపోయాం' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో సన్నాహాకాలకు సమయం సరిపోవడం లేదని కోహ్లీ గతంలోనే బీసీసీఐకి తెలిపిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు.. కొంతమంది టెస్టు క్రికెటర్లను ముందుగానే అక్కడికి పంపే యోచనలో బోర్డు ఉన్నదని ఆయన తెలిపారు.
డిసెంబరు 20 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌కి కటక్‌లోని బారబతి స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications