Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌరాష్ట్రను మట్టికరిపించి.. ఇరానీ కప్ టైటిల్ అందుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా..!

Rest Of India Won The Irani Cup 2022 Title, ROI Defeated Sourastra In The Final

రాజ్‌కోట్‌లో జరిగిన ఇరానీ కప్ ఫైనల్లో సౌరాష్ట్రను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన రెస్ట్ ఆఫ్ ఇండియా విజేతగా నిలిచింది. మంగళవారం చివరి రోజు 105పరుగుల లక్ష్యాన్ని తొలి సెషన్లోనే ఛేదించి రెస్ట్ ఆఫ్ ఇండియా విజయాన్ని ముద్దాడింది. అభిమన్యు ఈశ్వరన్ 63పరుగులు నాటౌట్, కీపర్ కోన భరత్ 27నాటౌట్ ఇద్దరు కలిసి 81పరుగుల మ్యాచ్ విన్నింగ్ పార్ట్ నర్ షిప్ నెలకొల్పి రెస్ట్ ఆఫ్ ఇండియాను విజయతీరాలకు చేర్చారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా యువ బౌలర్ కుల్దీప్ సేన్ (19ఓవర్లలో 5/94) అద్భుత ప్రదర్శనతో సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ పతనాన్ని శాసించాడు.

24ఓవర్లకే సౌరాష్ట్ర ఆలౌట్

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర పతనాన్ని ముఖేష్ కుమార్ 4, కుల్దీప్ సేన్ 3, ఉమ్రాన్ మాలిక్ 3వికెట్లు శాసించారు. దీంతో 24.5ఓవర్లకే సౌరాష్ట్ర చాప చుట్టేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా 374పరుగులు చేసి 276పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్ మీద మంచి పట్టు సాధించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ (138పరుగులు) సెంచరీతో అదరగొట్టగా.. హనుమ విహారీ (82 పరుగులు), సౌరభ్ కుమార్ (55పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 5, జయదేవ్ ఉనద్కత్ 2, చిరాగ్ 2 వికెట్లు తీశారు.

కుల్దీప్ సేన్ 5వికెట్ల హాల్‌తో అదరగొట్టడంతో..

ఇక రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సౌరాష్ట్ర బ్యాటర్లు గట్టిగా ప్రతిఘటన కనబరిచారు. 380పరుగులు చేశారు. అయినప్పటికీ టార్గెట్ మాత్రం 105పరుగులు మాత్రమే రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు ఉంచగలిగారు. సౌరాష్ట్ర బ్యాటర్లలో కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ 89పరుగులు, ప్రేరక్ మన్కడ్ 72పరుగులు, షెల్డన్ జాక్సన్ 71పరుగులు, అర్పిత్ వసవడ 55పరుగులు హాఫ్ సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో కుల్దీప్ సేన్ 5/98 ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇక తర్వాత ఛేదనకు దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి సగర్వంగా ఇరానీ కప్ అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ముఖేష్ కుమార్ అందుకున్నాడు.

తుది జట్లు :

సౌరాష్ట్ర : హార్విక్ దేశాయ్, స్నెల్ పటేల్ (వికెట్ కీపర్), చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వాసవాడ, ప్రేరక్ మన్కడ్, చిరాగ్ జానీ, జయదేవ్ ఉనద్కత్ (కెప్టెన్), ధర్మేంద్రసింగ్ జడేజా, పార్త్ భూట్, చేతన్ సకారియా

రెస్ట్ ఆఫ్ ఇండియా : ప్రియాంక్ పంచాల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, హనుమ విహారి (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ముఖేష్ కుమార్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ అగర్వాల్

Story first published: Tuesday, October 4, 2022, 17:45 [IST]
Other articles published on Oct 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+