చెన్నై: క్రికెట్‌లో జట్టు సహచరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, ప్రత్యర్ధి జట్టును గౌరవించడం ఆటలో ఎంతో ముఖ్యమని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ యువ ఆటగాళ్లకు హితబోధ చేసాడు.
"ఎల్లప్పుడూ జట్టుగా ఆడుతున్నామనే విషాయన్ని గుర్తుంచుకోవాలి. మీ పాట్నర్‌ని నమ్మాలి. అవతలి ఆటగాడు వేగంగా ఓ పరుగు తీద్దామని పిలిస్తే, అతడి నిర్ణయాన్ని మన్నించాలి. ఎందుకిలా చేస్తున్నాడని ఆలోచించవద్దు. పరిగెత్తాలంతే. దీంతో పాటు ప్రత్యర్ధి జట్టును ఎప్పుడూ గౌరవించాలి" అని గురువారం జర్మనీ కార్ల తయారీ కంపెనీ బీఎమ్‌డబ్ల్యు కార్యక్రమంలో మాట్లాడుతూ సచిన్ చెప్పారు.

క్రికెట్‌లో ఎల్లప్పుడూ "ప్రత్యర్ధి జట్టుని ఓడించడానికే ఆడతాం. కానీ అదే సమయంలో విలువల గురించి మరిచిపోకూడదు. పోటీ ఉండాలి కానీ, సరైన స్పూర్తితో ఆడాలి" అని సచిన్ అన్నారు. ఇక చెన్నైలోని మహేంద్ర వరల్డ్ సిటీకి 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బీఎమ్‌డబ్ల్యు కంపెనీని సందర్శించారు.