ఉద్వాసన: సెలక్టర్ల నిర్ణయంపై రహానే ఏమన్నాడో తెలుసా?
హైదరాబాద్: తనను జట్టులోకి ఎంపిక చేయకుండా సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని టీమిండియా బ్యాట్స్‌మెన్ రహానే తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు రహానేను ఎంపిక చేయని సంగతి తెలిసిందే. వన్డే సిరిస్‌లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ రహానేకు టీ20 సిరీస్‌కు సెలక్టర్లు చోటు కల్పించలేదు.
నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో 7 వికెట్లతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. వన్డే సిరిస్ అనంతరం ప్రకటించిన టీ20 జట్టు 15 మంది సభ్యుల్లో రహానేని పేరుని సెలక్టర్లు ప్రకటించలేదు. శిఖర్ ధావన్ జట్టులోకి రాగా రహానేకు సెలక్టర్లు ఉద్వాసన పలికారు.

ముంబైలో రహానే మీడియాతో
దీనిపై రహానే ముంబైలో మీడియాతో మాట్లాడాడు. 'జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్ల ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా. ఆటగాళ్ల మధ్య పోటీ మంచి ప్రదర్శనకు కారణమవుతోంది. జట్టులో ఎవరికి అవకాశం వచ్చినా బాగా ఆడుతున్నారు. ఈ పోటీని ప్రతిసారి ఆస్వాదిస్తాను' అని రహానే అన్నాడు.

వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్‌లో ఓపెనర్‌గా రాణించి వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వెస్టిండీస్ పర్యటన నుంచి నా ఫామ్‌ను కొనసాగించడం సంతృప్తినిచ్చింది. నాపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించా. వెస్టిండీస్ పర్యటన నుంచి నా ఫామ్ కొనసాగుతుంది' అని రహానే తెలిపాడు.

రోహిత్‌తో జట్టకు మంచి శుభారంభాన్ని అందించా
రోహిత్‌తో జట్టకు మంచి శుభారంభాన్ని అందించా. వచ్చే సిరీస్‌లలో నాకు అవకాశం లభిస్తే ఈ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలుస్తా. ఇక జట్టు ప్రదర్శన గర్వించదగ్గ విషయం. మా లక్ష్యం ఒకటే 2019 వరల్డ్‌కప్. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం' అని రహానే అన్నాడు.

ధావన్‌తో ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తిక్‌లకు చోటు
టీ20 జట్టులో ధావన్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తిక్‌లకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే రహానె సోమవారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ముంబై రహదారులను శుభ్రం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications