ఇండియా ఫ్యాన్స్ వెర్బల్ టెర్రరిస్టులు: ప్రముఖ పాక్ జర్నలిస్ట్ ట్వీట్..! పిచ్చికుక్కలా మొరగొద్దన్న నెటిజన్లు

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు ముందు అభిమానుల నెట్టింటి సమరాలు మొదలయ్యాయి. పాక్ వర్సెస్ భారత్ మ్యాచ్ అంటే క్రికెట్లోనే గొప్ప రైవల్రీ. కేవలం ఆసియాకప్, ప్రపంచకప్ లాంటి టోర్నీల్లోనే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు ప్రస్తుతం జరుగుతున్నాయి. తాజాగా ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా ఆగస్టు 28న ఇరు జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ గురించి నెట్టింట ఇప్పటికే పోస్టుల మీద పోస్టులు, కామెంట్ల మీద కామెంట్లు హోరెత్తుతున్నాయి. అయితే కొన్నిసార్లు అభిమానులు కాస్త హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఇది క్రికెట్ అనే గేమ్ మాత్రంగా చూడకుండా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా పాకిస్థాన్ జర్నలిస్టు ఒకడు ఇలాంటి విద్వేష పూరిత కామెంట్లు చేశాడు.
బాబర్ ఆజామ్, షాహీన్ అఫ్రిది అంటే కుళ్లు
ఈ రోజుల్లో ట్రోల్స్, విమర్శలు, మీమ్స్, కామెంట్లు కామనే. కానీ వాటికంటూ ఓ హద్దుపద్దు ఉండాలి. అది సదరు జర్నలిస్టు మర్చిపోయాడు. పేరుకే జర్నలిస్టు కానీ.. ఓ బద్మాషీతనం అతనిలో బానే ఉన్నట్లు అతని వ్యాఖ్యల బట్టే అర్థమవుతుంది. భారత క్రికెట్ జట్టు అభిమానులు వెర్బల్ టెర్రరిస్టులు అని పేర్కొన్నాడు. అంటే మాటల్లో ఉగ్రవాదులు అన్నమాట. పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్ఫా ఫిరోజ్ జాకే అనే జర్నలిస్ట్ ఈ కూత కూశాడు. అతను పాకిస్తాన్‌లోని ఒక ఎలైట్ మీడియా హౌస్‌లో పనిచేస్తుండడం గమనార్హం. అలాగే పాకిస్థాన్ క్రికెటర్లు అయిన బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదీలను చూసి భారత అభిమానులు అసూయపడుతున్నారని కూడా అతను పేర్కొన్నాడు.
అసలేమని ట్వీట్ చేశాడంటే..?
'భారత క్రికెట్ అభిమానులు అర్గుమెంట్లు చేసే విషయంలో నిరక్షరాస్యులు. 24గంటలు మా భారత బోర్డు చాలా రిచ్ అంటూ మాటలు కక్కుతూనే ఉంటారు. మా హీరోలు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదిని చూసి తెగ కుళ్లుకుంటారు. ఏదైనా విదేశీ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తే అసలే తట్టుకోలేరు. ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అసలైన వెర్బల్ టెర్రరిస్టులు!' అని అర్ఫా ఫిరోజ్ మంగళవారం ట్వీట్ చేశారు. మొత్తం భారతీయ క్రికెట్ అభిమానులపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేయడంతో అతని ట్వీట్ పట్ల నెటిజన్లు ఓ రేంజులో ఫైర్ అవుతున్నారు.
ఏంటి బాబు అన్నావ్..!
నెటిజన్ల తిట్లు యమ ఘోరంగా ఉన్నాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం బుద్ధి చెప్పేలా మాట్లాడారు. ఒరే అర్ఫా.. అభిమానులు అన్నాక ఏదో అంటే అందరినీ కలిపి అంటావేంట్రా.. ఎవడ్రా నీకు జర్నలిస్టు జాబ్ ఇచ్చింది. పాకిస్తానీ క్రికెట్ అభిమానులు ఎంతటి పిచ్చి మాటలు మాట్లాడతారో తెలుసా.. అలా అని మేము అందరినీ కలిపి అన్నామా. కాస్త నోరు అదుపులో పెట్టుకో.. నీకే మంచిది.' అంటూ హితవు పలికాడు. మరో నెటిజన్ ఏంట్రా కూశావ్.. మాటలు అదుపులో పెట్టుకో.. నోరు ఉంది కదా అని పిచ్చికుక్కలా మొరగొద్దు..' అంటూ ఇచ్చిపడేశాడు. ఏంటీ బాబు అన్నావ్.. మేం వెర్బల్ టెర్రరిస్టులమా.. సరే మీరు నిజంగా టెర్రరిస్టులు కదరా' అంటూ మరో నెటిజన్ కడిగిపారేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications