పాజిటివ్ మెసేజ్: రిపబ్లిక్ డే వేడుకల్లో కోహ్లీ
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కాన్పూర్‌లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు జట్లు కాన్పూర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని కాన్పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కెప్టెన్ కోహ్లీతో పాటు సహచర ఆటగాడు మహ్మద్ షమీ, ఐపీఎల్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోహ్లీ తన ట్విటర్ ఖాతా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అందులో సానుకూల మార్పులు సాధించే దిశగా ఈ రిపబ్లికే డే అందరికీ శక్తిని ఇవ్వాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మన జాతీయ పతాకం ఎప్పుడూ రెపరెపలాడుతుండాలని అన్నాడు.
మరోవైపు రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని పలువురు క్రికెటర్లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో సచిన్ టెండూల్కర్, ఉమేశ్ యాదవ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, హార్ధిక్ పాండ్యా, హార్భజన్ సింగ్ తదితరులు ఉన్నారు.
విరాట్ కోహ్లీ
68వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని టీమండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
సచిన్ టెండూల్కర్
68వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
వీవీఎస్ లక్ష్మణ్
68వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని టీమిండియా ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
వీరేంద్ర సెహ్వాగ్
68వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
హార్ధిక్ పాండ్యా
68వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
హర్భజన్ సింగ్
68వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని టీమిండియా వెటరన్ స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
శిఖర్ ధావన్
68వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
అనిల్ కుంబ్లే
రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications