హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో బాధకరమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్ నం.10లో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ హఠాన్మరణం చెందాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ క్రికెట్ సంఘం ఆటల పోటీలు నిర్వహించింది.
ఇందులో భాగంగా జహీరానగర్‌లోని ఖాళీ స్థలంలో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఆంటోని(25)కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో హఠాత్తుగా నేలకూలాడు. వెంటనే అప్రమత్తమైన సహచర ఆటగాళ్లు అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి చేర్చిన కొద్ది నిమిషాల్లోనే ఆంటోనీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ క్రికెట్ మ్యాచ్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఓ హోటల్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.