జెర్సీ సినిమాలో హీరో నాని పోషించే పాత్ర ఏ క్రికెటర్‌దో తెలుసా?

హైదరాబాద్: ప్రస్తుతం భారత్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురి సినీ, రాజకీయ, క్రీడాకారుల బయోపిక్స్ విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అజహరుద్దీన్, మేరీకోమ్, మిల్కా సింగ్ తదితరుల బయోపిక్‌లు అభిమానుల ప్రేక్షకాధరణ పొందిన సంగతి తెలిసిందే.
మరికొందరి బయోపిక్స్ నిర్మాణంలో ఉన్నాయి. కపిల్ దేవ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, పీటీ ఉష, పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా బయోపిక్స్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. 1983 వరల్డ్ కప్ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నాడు.
నూతన సంవత్సర కానుకగా
తాజాగా, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు. ‘మళ్లీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
రామన్ లంబా పాత్రలో నాని
శ్రద్దా శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘36 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా అతడు నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. విజయాలతో పాటు వైఫల్యాలు వెనుక నిలబడ్డాయి. 1996-97లో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్‌పై అతడికి ఉన్న ప్రేమ బయట పెట్టింది' అంటూ ఆ క్రికెటర్ ఎవరన్నదానిపై సస్పెన్స్‌ను క్రియేట్ చేశాడు.

ఈ కథని ఎమోషనల్ జర్నీగా
క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథని ఎమోషనల్ జర్నీగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారు. సాధారణ యువకుడు టీమిండియా తరుపున అంతర్జాతీయ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. చోటు దక్కించుకున్నతర్వాత అతడు జట్టుకు ఎలాంటి విజయాలు సాధించి పెట్టాడు అనే అంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నాని పోషిస్తోన్న క్రికెటర్ మరెవరో కాదు రామన్ లంబా
ఈ సినిమాలో నాని పోషిస్తోన్న క్రికెటర్ పేరు రామన్ లంబా. దేశవాళీ క్రికెట్‌లో రామన్ లాంబా మొత్తం 87 మ్యాచ్‌లాడి 53.91 యావరేజితో 6362 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన రమన్ లాంబా 1996-97 రంజీ సీజన్‌లో పరుగుల వరద పారించాడు. అనంతరం భారత జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. రామన్ లంబా భారత్ తరుపున నాలుగు టెస్టులు, 32 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు.

వన్డేల్లో రామన్ లంబా అత్యధిక స్కోరు 102
వన్డేల్లో రామన్ లంబా అత్యధిక స్కోరు 102. తన ఆరో మ్యాచ్‌లో ఈ స్కోరు సాధించగా, తన అరంగేట్రం వన్డేలో హాఫ్ సెంచరీ(64 పరుగులు) సాధించాడు. ఐర్లాండ్ తరుపున అనధికారిక వన్డేల్లో కూడా ఆడాడు. అయితే, రామన్ లంబా క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. బంగ్లాదేశ్‌లోని ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో బంతి అతడి తలను బలంగా తాకడంతో కోమాలోకి వెళ్లాడు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 23, 1998న ఢాకాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. కన్నుమూశాడు. రామన్ లంబాకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications