ఆస్ట్రేలియా పర్యటనలోనైనా రోహిత్ శర్మకు చోటు దక్కేనా?

హైదరాబాద్: వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో రోహిత్ శర్మ మళ్లీ తిరిగి ఫామ్‌ను అందుకోవడంతో విండిస్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లో అతడికి చోటు దక్కుతుందని అంతా భావించారు.

రోహిత్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోని సెలక్టర్లు
అయితే, సెలక్టర్లు మాత్రం అతడి ప్రదర్శనను ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను ఎంపిక చేసేందుకే ఇప్పుడు వెస్టిండిస్ సిరిస్ నుంచి రోహిత్ శర్మను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

ఆస్ట్రేలియా పర్యటనలో చోటు దక్కేనా?
ముంబై మిర్రర్‌లో వచ్చిన వార్తల ప్రకారం బౌన్సీ ట్రాక్‌లపై రోహిత్ శర్మ ఆడిన ఆటతీరుని బట్టి అతడు ఆస్ట్రేలియా పర్యటనలో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో రోహిత్ శర్మకు చోటు కల్పించినప్పటికీ, ఆశించిన మేరకు రాణించలేదు.

పరిమిత ఓవర్లలో అద్భుతమైన ఫామ్‌లో రోహిత్ శర్మ
అప్పటి నుంచి రోహిత్ శర్మ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. పరిమిత ఓవర్లలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, టెస్టుల్లో మాత్రం అతడి ప్రదర్శన క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తోంది. 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడక పోవడం విశేషం.

టెస్టుల్లో పేలవ ప్రదర్శన
31 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటివరకు భారత్ తరుపున 25 టెస్టు మ్యాచ్‌లాడాడు. గత ఐదేళ్లలో రోహిత్ శర్మ టెస్టుల్లో చేసిన పరుగులు కేవలం 1479. ఇక, యావరేజి విషయానికి వస్తే 40. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక, 50కిపైగా తొమ్మిదిసార్లు పరుగులు చేశాడు. ఇక, విదేశీ పర్యటనల్లో రోహిత్ శర్మ ప్రదర్శన మరీ దారుణం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications