Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంతపని జరిగింది?: గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌కు కారణమైన బిజీ షెడ్యూల్

Reports: A packed cricketing schedule forced Stuart Broad to break up with his girlfriend

హైదరాబాద్: గత ఐదు నెలలుగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్... సింగర్ మోలియి కింగ్‌ డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి రొమాన్స్‌‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది.

అందుకు ప్రధానం కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇద్దరు కూడా తమ తమ వృత్తుల్లో బిజీగా ఉంటూ ఒకరికొకరు కలవలేకపోవడమే. దీంత చేసేదేమీ లేక ఇద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. మిడ్ డే‌లో వచ్చిన వార్తా కథనం ప్రకారం వారి సన్నిహితులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

దీనిపై వారు మాట్లాడుతూ "అవును. బ్రాడ్‌-కింగ్‌ విడిపోయారు. బిజీగా ఉండటం వలన ఇద్దరూ కలవలేకపోతున్నారు. దీంతో వారు విడిపోదామని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఇందుకు వారు చాలా బాధ పడుతున్నారు" అని సన్నిహితులు తెలిపారు. ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య టెస్టు సిరిస్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరూ విడిపోవడం విశేషం.

1
42375

నిజానికి క్రికెటర్లు ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు. వరుస సిరీస్‌లు, మధ్యలో విరామం దొరికితే టీ20 లీగ్‌లు ఆడుతూ ఉంటారు. ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్ జరుగుతుంది. ఈ సిరిస్‌లో భాగంగా స్టువర్ట్ బ్రాడ్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆడుతున్నాడు.

లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టులో స్టువర్ట్ బ్రాడ్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టులో ఓటమితో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా 0-2తో వెనకబడి ఉంది. ఇరు జట్ల మధ్య నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆగస్టు 18నన మూడో టెస్టు ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, August 14, 2018, 16:10 [IST]
Other articles published on Aug 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+