న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలీవుడ్‌లోకి మహేంద్ర సింగ్ ధోని: కొత్త వెంచర్ గురించి తెలుసా?

MS Dhoni Could Enter Bollywood After Hanging His Boots || Oneindia Telugu
Reports: MS Dhoni could enter Bollywood after hanging his boots

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బాలీవుడ్‌లో సినిమాలు రూపొందించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే ధోని సొంతంగా ఓ బ్యానర్‌ని స్థాపించి నిర్మాతగా సినిమాలు తీయాలని నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అతడే సమయమిచ్చాడు: ధోనీని ఎంపిక చేయకపోవడం వెనుక కొత్త ట్విస్ట్!అతడే సమయమిచ్చాడు: ధోనీని ఎంపిక చేయకపోవడం వెనుక కొత్త ట్విస్ట్!

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ధోనికి మంచి స్నేహితుడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంతో కలిసి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల్ని నిర్మించాలని ధోని భావిస్తున్నాడట. వీరిద్దరి భాగస్వామ్యానికి సంబంధించిన వెంచర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఇదిలా ఉంటే, సొంతగడ్డపై వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ గురువారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ 15 మందిలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి చోటు దక్కలేదు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ధోనీకి సెలక్టర్లు అవకాశం కల్పించలేదని సమాచారం.

దీంతో 15 రోజుల పాటు సైన్యానికి సేవలందించి.. ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లిన ధోనీకి నిరాశే ఎదురైంది. రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ప్రకటించిన ధోనీ ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. టీమిండియా సహచర ఆటగాడు కేదార్‌ జాదవ్‌తో కలిసి ధోనీ గోల్ఫ్‌ ఆడారు.

చరిత్ర సృష్టించిన రొమేనియా: టీ20ల్లో 12 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టడంలో తమిళవాసి పాత్ర!చరిత్ర సృష్టించిన రొమేనియా: టీ20ల్లో 12 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టడంలో తమిళవాసి పాత్ర!

జాదవ్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడే సమయంలో ముఖానికి తెల్లరంగు పూసుకుని, తలకు నల్లని బంధన్‌ కట్టుకుని ధోనీ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోను కేదార్‌ జాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేశాడు. 'అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. హాకీ దిగ్గజం ధ్యాన్‌ చంద్ గారిని గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు.

Story first published: Friday, August 30, 2019, 19:15 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X