For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: లక్నోకు బ్యాడ్ న్యూస్: స్టార్ ప్లేయర్ దూరం

లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్. తమ జట్టు స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్ ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. పొత్తి కడుపు కండరాల గాయం కారణంగా అతను మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సమాచారం. అరంగేట్ర మ్యాచ్‌లోనే 155 కి.మీ వేగం, వైవిధ్యంతో బంతులు సంధిస్తూ మయాంక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినప్పటికీ భవిష్యత్ స్టార్‌గా మంచి గుర్తింపు పొందాడు.

పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ల్లో మయాంక్ యాదవ్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టి సత్తాచాటాడు. కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. ఒకే ఓవర్ బౌలింగ్ వేసి మైదానాన్ని వీడాడు. పొత్తి కడుపు కండరానికి గాయమవ్వడంతో దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు.

Reports Mayank Yadav doubtful for remainder of IPL 2024

తిరిగి కోలుకుని ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. కానీ మయాంక్‌ మరోసారి గాయపడ్డాడు. దీంతో మయాంక్ ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానమే అని తెలుస్తోంది. అయితే మయాంక్‌కు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కాంట్రాక్ట్ పొందితే అతను ఎన్సీఏలో మెరుగైన చికిత్స తీసుకోవచ్చు. ఉమ్రాన్ మాలిక్, విద్వత్‌ కావేరప్ప, వైశక్‌ విజయ్‌కుమార్‌, యశ్‌ దయాల్‌, ఆకాశ్‌ దీప్‌ వంటి పేసర్లకు బీసీసీఐ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా సాగుతున్న ఈ సమయంలో మయాంక్ దూరమవ్వడం లక్నో‌కు తీవ్ర ఎదురుదెబ్బే. పరుగులను కట్టడి చేయడంతో పాటు వికెట్లను పడగొట్టే మయాంక్ జట్టు లేకపోవడం ఎల్‌ఎస్‌సీ ప్రతికూలాంశమే. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరింట్లో నెగ్గి 12 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికీ లక్నో టాప్-4లోనే ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Story first published: Thursday, May 2, 2024, 8:55 [IST]
Other articles published on May 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+