Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం.. LSG మేనేజ్మెంట్‌‌కు బిగ్ షాక్! (Video)

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఆ ఫ్రాంజైజీ యజమాని సంజీవ్ గోయెంకా దారుణంగా అవమానించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం అనంతరం మైదానంలోనే రాహుల్‌పై సంజీవ్ విరుచుకుపడ్డాడు. రాహుల్‌తో ఆవేశంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం మౌనంగా నిలబడిపోయాడు.

అసలేం జరిగిందంటే.. ఉప్పల్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌‌లో లక్నో 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55*; 30 బంతుల్లో, 9x4) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (29; 33 బంతుల్లో, 1x4, 1x6) స్లో ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం ఛేదనకు దిగిన ఎస్‌ఆర్‌‌హెచ్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. ట్రావిస్ హెడ్ (89*; 30 బంతుల్లో, 8x4, 8x6), అభిషేక్ శర్మ (75*; 28 బంతుల్లో, 8x4, 6x6) చెలరేగి 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.

Reports KL Rahul Set to Depart Lucknow Super Giants for RCB

తమ జట్టు ఘోర పరాజయం చవిచూడటంతో లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. జట్టు సారథి కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సంఘటన తీవ్ర చర్చనీయాశంగా మారింది. కెప్టెన్‌తో అమర్యాదగా ప్రవర్తించడమేంటని లక్నో ఫ్రాంచైజీపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్‌కు మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు ఈ సంఘటనతో కేఎల్ రాహుల్ సంచనల నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. గత రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్ చేర్చిన విషయాన్ని మరిచి, ఓ పరాజయం గురించి అమర్యాదగా యజమాని ప్రవర్తించిన తీరుపై రాహుల్ చాలా బాధపడ్డాడని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ ముగిసిన అనంతరం లక్నో ఫ్రాంచైజీకి రాహుల్ గుడ్‌బై పలకనున్నట్లు సమాచారం.

కాగా, నెట్టింట కేఎల్ రాహుల్ పాత వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. తన సొంత రాష్ట్ర టీమ్ అయిన ఆర్సీబీ తరఫున తనకి మరోసారి ఆడాలని ఉందని రాహుల్ దానిలో పేర్కొన్నాడు. దీంతో బెంగళూరు టీమ్‌లోకి రాహుల్ వెళ్లాలని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు డుప్లెసిస్‌ తర్వాత నయా కెప్టెన్‌‌ కోసం వెతుకుతున్న బెంగళూరు ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Thursday, May 9, 2024, 18:34 [IST]
Other articles published on May 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+