
హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మంది క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. గతేడాది ఐపీఎల్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే పాల్గొన్నారు. ఐపీఎల్ 2017 సీజన్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హాసన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
అంతేకాదు గత ేడు సీజన్ల నుంచి షకీబ్ ఉల్ హాసన్ కోల్‌కతా తరుపునే ఆడటం విశేషం. అయితే ఐపీఎల్ పదో సీజన్‌లో షకీబ్ ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. బంగ్లాకు చెందిన మరో ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు.
అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లను 11వ సీజన్ కోసం వేలానికి వదిలేయాలని రెండు ఫ్రాంఛైజీలు భావించాయి. వీరితో పాటు మరో మరో ఆరుగురు బంగ్లాదేశ్‌కు చెందిన ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా వచ్చిన ఆటగాళ్ల జాబితాలో తమీమ్ ఇక్బాల్, మహముదుల్లా రియాద్, మెహేది హాసన్, షబ్బీర్ రహ్మాన్, లిటన్ కుమార్ దాస్, అబ్దుల్ హాసన్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్ 2018 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు.
వాస్తవానికి ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.