Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2020 ఫైనల్ జరగనుందా?

Reports: IPL 2020 final likely to be played at Motera Stadium in Ahmedabad

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ జరగనుందా? అంటే అవుననే సమాధాన వినవస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని మొతేరా వద్ద నిర్మిస్తోన్న ఈ స్టేడియం తుది దశకు చేరుకుంది. దీంతో వచ్చే ఎడిషన్ ఐపీఎల్ ఫైనల్‌ను నిర్వహించాలని బీసీసీఐ అలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగితే

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగితే

ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ స్టేడియంలో గనుక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగితే పూర్తి సామర్థ్యం మేరకు నిండితే లక్షా 10వేల మందికి హాజరయ్యే అవకాశముంది. అదే గనుక జరిగితే అత్యధిక మంది వీక్షించిన టీ20 మ్యాచ్‌గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. మొతేరా స్టేడయం భారత్‌లోకెల్లా పురాతన స్టేడియాల్లో ఒకటి.

63 ఎకరాల స్థలంలో

63 ఎకరాల స్థలంలో

మొత్తం 63 ఎకరాల స్థలంలో నిర్మిస్తోన్న ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. మెల్‌బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు. ఈ స్టేడియంలో మొత్తం నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు, మూడు ప్రాక్టీస్ గ్రౌండ్‌లు ఉంటాయి. ట్రైనింగ్ సెంటర్‌తో పాటు 50 గదులతో క్లబ్ హౌస్ ఉంటుంది. 76 కార్పోరేట్ బాక్సులు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటాయి.

ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా

ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా

ఈ స్టేడియంలో ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది. వీటితో పాటు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులు... స్క్వాష్ ఎరీనా, టెన్నిస్ ఎరీనా, 3డీ ప్రొజెక్టర్ థియేటర్ అదనం. ల‌క్ష‌ మంది ఒకేసారి ఈ స్టేడియానికి చేరుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను కూడా గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ పూర్తి చేస్తోంది.

90 శాతం పూర్తైన స్టేడియం నిర్మాణం

90 శాతం పూర్తైన స్టేడియం నిర్మాణం

ఈ స్టేడియం నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తైంది. జనవరి 2020 కల్లా స్టేడియంలో అందుబాటులోకి రానున్నట్లు గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వాని తెలిపారు. వచ్చే మార్చిలో భారత్ vs వరల్డ్ లెవన్ జట్ల మధ్య మ్యాచ్ ద్వారా ఈ స్టేడియం పునఃప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐపీఎల్ ఫైనల్‌ను కూడా ఇక్కడే నిర్వహించే అవకాశముందని ఇటీవల ఓ టాక్‌షోలో పాల్గొన్న నిర్వాహకులు ఈ విషయాన్ని తెలిపారు.

Story first published: Thursday, December 26, 2019, 18:16 [IST]
Other articles published on Dec 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+