హార్ధిక్ పాండ్యా పెళ్లికి గ్రీన్ సిగ్నల్: కాబోయే భార్య ఎవరో తెలుసా?

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే పాండ్యాకు లండన్‌లో వెన్నునొప్పి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్, ట్రైనర్స్ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, పాండ్యా వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది.
సినీ నటి నటాషా స్టాన్కోవిక్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, హార్దిక్ పాండ్యా... నటాషా స్టాన్కోవిక్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది మేలో పాండ్యానే స్వయంగా నటాషాను తల్లిదండ్రులకు పరిచయం చేశాడని తెలుస్తోంది.
సత్యాగ్రహ సినిమాలో
పాండ్యా కుటుంబ సభ్యులను నటాషా కలవడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో పాండ్యా తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించారని... త్వరలోనే వీరి పెళ్లి జరిపించేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ముంబైకు చెందిన నటాషా ఓ సెర్బియన్ నటి మరియు డ్యాన్సర్. బాలీవుడ్‌లో ప్రకాశ్ ఝా దర్శకత్వంలో వచ్చిన సత్యాగ్రహ సినిమాలో నటించింది.

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా
ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహారిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 8లోనూ కంటెస్టంట్‌గా పాల్గొంది. డీజే వాలా బాబు పాటతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపుకి తిప్పుకుంది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్, అనుష్క శర్మ జీరో మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం తన మాజీ బాయ్‌ప్రెండ్ అలే గోనీతో నాచ్ బాలియే సీజన్ 9లో నటిస్తోంది.

గతంలో హార్దిక్ పాండ్యా
ఇక, హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే గతంలో ఎల్లీ అవ్రామ్, ఊర్వశీ రౌటేలా, ఈషా గుప్తాలతో డేటింగ్ చేశాడు. ఇటీవలే శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్, ట్రైనర్స్ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ ఓ వీడియోని పోస్టు చేశాడు. అందులో తొలుత నెమ్మదిగా నడవడం ప్రారంభించిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత కాసేపు వీల్‌చైర్‌లో తిరిగాడు.

బేబి స్టెప్ వీడియో
ఈ వీడియోని పోస్టు చేసి "బేబి స్టెప్... పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి నా ప్రయాణం మొదలైంది. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" అంటూ హార్టిక్ ఆ వీడియోని పోస్టు చేస్తూ కామెంట్ పెట్టాడు. దీంతో హార్దిక్ పాండ్యా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రార్ధిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications