Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు: ధోని, రవిశాస్త్రికి పాండ్యా క్షమాపణ

Reports: Hardik Pandya apologises to MS Dhoni, head coach Ravi Shastri

హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. ఈ వివాదంపై ఇప్పటికే ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పిన పాండ్యా, తాజాగా టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కూడా క్షమాపణలు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు.

కాఫీ విత్ కరణ్ టాక్ షోపై పెద్ద ఎత్తున విమర్శలు

కాఫీ విత్ కరణ్ టాక్ షోపై పెద్ద ఎత్తున విమర్శలు

మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారం కాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

సోషల్ మీడియాలో నెటిజన్లు అభిమానులు

సోషల్ మీడియాలో నెటిజన్లు అభిమానులు

భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం విధించాలని తాను ప్రతిపాదించినట్లు బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ఇప్పటికే స్పష్టం చేశారు.

వన్డే సిరిస్‌లో ఆడటంపై అనుమానాలు

వన్డే సిరిస్‌లో ఆడటంపై అనుమానాలు

దీంతో శనివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. రెండు వన్డేల నిషేధం వార్తలు రావడంతో హార్దిక్ పాండ్యా కోచ్ రవిశాస్త్రి, ధోనీ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తొలుత వారిద్దరికీ క్షమాపణలు చెప్పిన పాండ్యా.. తన సోదరుడు, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన కృనాల్‌ పాండ్యాతో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.

Story first published: Friday, January 11, 2019, 15:07 [IST]
Other articles published on Jan 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+