Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిపోర్టర్ మీద చిర్రెత్తుకొచ్చిన జాస్ బట్లర్‌.. పోయి పని చూసుకో అన్నట్లు ఘాటు రిప్లే

Reporter Questioned About Bumrah Makes joss Buttler to get Angry in Press Conference

ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సాధారణంగా స్టేడియం లోపల, బయట చాలా ప్రశాంతంగా కన్పిస్తుంటాడు. అతను ఎక్కువగా స్మైలీ ఫేసుతో ఉండడానికి ప్రయత్నిస్తాడు. అయితే బట్లర్‌కు చాలా సందర్భాల్లో అగ్రెసివ్ అయిపోవడాన్ని కూడా మనం చూశాం. ఇక తాజాగా మరోసారి బట్లర్‌కు చిర్రెత్తుకొచ్చింది. అన్ని ఫార్మాట్‌లలో ప్రస్తుత అత్యుత్తమ బౌలర్ భారతదేశానికి చెందిన జస్ప్రీత్ బుమ్రానే కాదా అని ఒక జర్నలిస్ట్ పదేపదే అడగడంగో బట్లర్ చికాకుపడ్డాడు. బట్లర్ తొలుత చాలా కూల్‌గా వివరంగా సమాధానమిచ్చాడు. బుమ్రాపై ప్రశంసలు గుప్పించాడు. అయితే జర్నలిస్ట్‌ మాత్రం మీరు అంతా బానే చెబుతున్నారు కానీ ఇంతకీ బుమ్రా గొప్ప బౌలర్ అని ఒప్పుకుంటారా లేదో మాత్రం క్లారిటీగా చెప్పట్లేదు అని బట్లర్‌ను సూటిగా అడిగాడు.

దీంతో బట్లర్ కాస్త అసహనానికి గురయ్యాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లాండ్‌తో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో వన్డే క్రికెట్‌లో తొలిసారిగా ఇగ్లాండ్‌ను 10వికెట్ల తేడాతో భారత్ ఓడించిన అనంతరం విలేకరుల సమావేశంలో బట్లర్ కూర్చున్నాడు. అప్పటికే బుమ్రా బౌలింగ్ గురించి పలువురు విలేకరులు బట్లర్‌ను అడిగారు. బుమ్రా తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బట్లర్, ఓ రిపోర్టర్ మధ్య సంభాషణ ఇలా సాగింది.

రిపోర్టర్: నాసిర్ హుస్సేన్ కామెంట్రీ టైంలో మాట్లాడుతూ.. అన్ని ఫార్మాట్లలో బుమ్రా కంటే మెరుగైన బౌలర్ ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా? అని అన్న విషయం విన్నారు కదా.. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

బట్లర్: అతను అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. అతను కొన్నేళ్లుగా ప్రపంచంలోని ప్రముఖ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు. టీమిండియాతో ఆడటం గొప్ప సవాలు. ఎందుకంటే అద్భుతమైన బౌలర్లను, బ్యాట్స్‌మెన్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతను అత్యుత్తమ బౌలర్లలో ఒకడనడంలో సందేహం లేదు. ఇక అతని బౌలింగ్లో మేం మరింత మెరుగ్గా ఆడడానికి తర్వాత మ్యాచ్‌లో ప్రయత్నిస్తాం.

రిపోర్టర్: కానీ నేను అడిగింది ఇది కాదు బట్లర్, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, అతను అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్లేయరా కాదా ముందు అది చెప్పండి.?

బట్లర్: బట్లర్ కాస్త ఘాటుగా మాట్లాడుతూ.. పోయి నువ్వే డిసైడ్ చేసుకో..!
ఇక బట్లర్ కోప్పడడంతో ఆ రిపోర్టర్ కాస్త గమ్మున ఉండిపోయాడు.

Story first published: Wednesday, July 13, 2022, 22:36 [IST]
Other articles published on Jul 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+