
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్ల తప్పిదాలను మరింత తగ్గించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రంట్ పుట్ నోబాల్‌ను పర్యవేక్షించే బాధ్యత థర్డ్ అంపైర్‌కు కూడా అప్పగించనుంది.
దీంతో ప్రంట్ ఫుట్ నోబాల్‌ను గుర్తించడంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో పాటు థర్డ్ అంపైర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో రివ్యూ కోరినప్పుడు మాత్రమే రీప్లేలో థర్డ్ అంపైర్ నోబాల్‌ను పరిశీలిస్తున్నారు. బీసీసీఐ అభ్యర్థన మేరకు ఈ నిబంధనను ఐసీసీ అమలు చేయనుంది.
దీనిని తొలుత భారత్‌లో జరిగే దేశవాళీ క్రికెట్‌లో పరీక్షిస్తారు. ఇది గనుక విజయవంతమైన తర్వాత త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం ప్రవేశపెట్టనున్నారు. ముంబై మిర్రర్‌తో ఐసీసీ అధికారి ఒకరు మాట్లాడుతూ "ఐసీసీ ప్రస్తుతం ట్రయిల్స్ వేయనుంది. ఈ ట్రయల్స్ భారత్‌లోని దేశవాళీ క్రికెట్‌లో ప్రవేశపెడతారు" అని అన్నారు.
అయితే, ఇది సాంకేతిక పరంగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఐసీసీ వెనకడగు వేయవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మ్యాచ్‌లో నోబాల్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయని కూడా అంటున్నారు. కాగా, ఐపీఎల్ 12వ సీజన్‌లో నోబాల్ వివాదం పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే.
మరిన్ని ప్రో కబడ్డీ వార్తల కోసం
ఆర్సీబీ Vs ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి నోబాల్ అయినా అంపైర్లు ప్రకటించని సంగతి తెలిసిందే. లసిత్ మలింగ వేసిన ఆఖరి బంతి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే బంతి కావడం... ఆ బంతి నో బాల్ అయినప్పటికీ అంఫైర్లు దానిని గమనించకపోవడంతో ఆర్సీబీ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆ మ్యాచ్‌లో గనుక గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంపైర్ల పొరపాటుపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.