Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Big Bash League: ఉత్కంఠ పోరులో రెనగేడ్స్ చిత్తు.. ఫించ్ హిట్టింగ్ వృధా

Renegades lose in a thrilling match with Perth Scorchers

బిగ్ బాష్ లీగ్‌లో రెనగేడ్స్ జట్టు మరో మ్యాచ్ ఓడింది. పెర్త్ స్కార్చర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రెనగేడ్స్ సారధి నిక్ మ్యాడిన్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (6), నిక్ మ్యాడిన్సన్ (0) ఇద్దరూ విఫలమయ్యారు. పీటర్ హాండ్స్‌కూంబ్ (9) కూడా నిరాశ పరిచాడు.

వరుసగా కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రెనగేడ్స్‌ను ఆరోన్ ఫించ్ (64) ఆదుకున్నాడు. తనదైన స్టైల్‌లో రెచ్చిపోయి ఆడిన అతను తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత వచ్చిన జొనాథన్ వెల్స్ (22), మెకెంజీ హార్వీ (16), విల్ సదర్లాండ్ (14 నాటౌట్), అకీల్ హొస్సేన్ (15 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో పెర్త్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ ఆడమ్ లిత్ (2) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (39) ఆ జట్టును ఆదుకున్నాడు. అతనికి కామెరూన్ బాంక్రాఫ్ట్ (46), జోష్ ఇంగ్లిస్ (47) మంచి సహకారం అందించాడు. వీళ్లు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. కెప్టెన్ ఆష్టన్ టర్నర్ (9) నిరాశ పరిచినా అప్పటికి విజయానికి కావలసిన పరుగులు తక్కువ కావడంతో మ్యాచ్ దాదాపుగా పెర్త్ చేతుల్లోకి వచ్చేసింది. ఆరన్ హార్డీ (9 నాటౌట్), నిక్ హాబ్సన్ (1 నాటౌట్) కలిసి లాంఛనం పూర్తి చేశారు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయం పెర్త్ జట్టును వరించింది. కీలక సమయంలో ధనాధన్ ఆటతో ఆకట్టుకున్న ఇంగ్లిస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Sunday, January 1, 2023, 20:44 [IST]
Other articles published on Jan 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+