ఎమ్‌సీఏ ఎందుకిలా చేసింది: వెయ్యి పరుగుల ధనవాడే ప్రవర్తన బాలేదా?
హైదరాబాద్: ప్రణవ్ ధనవాడే... గతేడాది క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డుని సృష్టించాడు. దీంతో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగిపోయింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఇంటర్ స్కూల్ లెవల్ టోర్నమెంట్‌లో ఆర్యా గురుకుల్ పాఠశాల జట్టుపై ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
కేవలం 323 బంతుల్లోనే 1000 పరుగులు సాధించాడు. అందులో 59 సిక్స్‌లు, 129 ఫోర్లు ఉన్నాయి. దీంతో అతడి ప్రతిభకు మరింత పట్టం కట్టేందుకు గాను ప్రణవ్ ధనవాడేకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సీఏ) స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. నెలకు రూ. 10,000ల చొప్పున ఐదేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందించనున్నట్లు ప్రకటన చేశారు.
అంటే ఈ స్కాలర్‌షిప్‌ను జనవరి 2016 నుంచి డిసెంబర్ 2021 వరకు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ఎమ్‌సీఏ పేర్కొంది. ఏడాది పాటు ధనవాడేకు సరిగ్గానే స్కాలర్ షిప్ అందించారు. అయితే ఈ ఏడాది అతడికి స్కాలర్ షిప్ ఆగిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రణవ్ ప్రదర్శన మెరుగగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ప్రణవ్ ధనవాడే తన ఆటతీరుతో పాటు స్కాలర్ షిప్‌ను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటున్నాడో ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సీఏ) ఓ సమీక్షను నిర్వహించింది. ఈ సమీక్షలో అతడికి స్కాలర్ షిప్ కొనసాగించే విషయమై ఓ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసీఏ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రణవ్ ధనవాడే ప్రదర్శనపై ఎమ్‌సీఏ సమీక్ష
'ప్రణవ్‌కు స్కాలర్ షిప్ ప్రకటించిన సమయంలోనే ప్రతి సీజన్ తర్వాత అతడి ప్రదర్శనపై సమీక్ష జరిపి, ఆ తర్వాతే తర్వాతి సీజన్‌కు సాయం అందించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాం' అని ఎమ్‌సీఏ సంయుక్త కార్యదర్శి ఉమేశ్ తెలిపాడు. అయితే ప్రణవ్‌కు గత ఆరు నెలల నుంచి స్కాలర్ షిప్ అందడం లేదని ఆలస్యం అవుతుందా లేక ఆపేశారా అర్ధం కావడం లేదని ప్రణవ్ తండ్రి ప్రశాంత్ అంటున్నాడు.

వెయ్యి పరుగులతో ప్రణవ్‌పై పెరిగిన అంచనాలు
గతేడాది జనవరిలో 1000 పరగులు ఇన్నింగ్స్‌తో ప్రణవ్‌పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ తర్వాత నుంచి అతడి ప్రదర్శన మెరుగవలేదు. అంతేకాదు మైదానం కూడా చిన్నది కావడం వల్లే ప్రణవ్ అంత భారీ ఇన్నింగ్స్ ఆడాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ప్రపంచ రికార్డుపై క్రీడా విశ్లేషకులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు.

ఎమ్‌సీఏ ఎంపిక చేసిన 35 మందిలో ప్రణవ్‌కు దక్కని చోటు
అంతేకాదు అండర్ 19 ఆటగాళ్లకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రాక్టీస్ కోసం ఎమ్‌సీఏ 35 మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో ప్రవణ్‌కు చోటు దక్కలేదు. ఇటీవల ఎమ్‌సీఏ మ్యాచ్‌కు నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ నుంచి కూడా కోచ్ అతడిని తప్పించాడు. ప్రణవ్ వికెట్ కీపింగ్ బాగానే చేస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మెరుగవ్వాల్సి ఉందని కోచ్ మోబిన్ అంటున్నాడు.

ప్రణవ్ బిహేవియర్ పట్ల కోచ్ అసంతృప్తి
ప్రణవ్ బిహేవియర్ పట్ల కోచ్ మోబిన్ కూడా ఏమంత సంతృప్తిగా లేడని తెలుస్తోంది. గతంలో కూడా పలుమార్లు ప్రణవ్ ధనవాడే బిహేవియర్ మార్చుకోవాలని, క్రికెట్ పైన సీరియస్‌గా దృష్టి సారించాలని గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ప్రణవ్ తన అయిదేళ్ల వయస్సులో మోబిన్ కళ్యాణ్‌లో నడుపుతున్న మోడర్న్ క్రికెట్ క్లబ్‌కు వచ్చాడు.

పలుమార్లు ప్రణవ్ ధనవాడేకు హెచ్చరికలు
తన అకాడమీలోని మిగతా వారిలాగే ప్రణవ్‌కు కూడా నేర్పించానని కోచ్ చెప్పారు. అయితే, ప్రాక్టీస్, వామప్ సమయంలో ప్రణవ్ జోకులు పేల్చుతూ సీరియస్‌నెస్‌గా కనిపించకపోయేవాడన్నారు. మిగతా వారిని ఆటపట్టించేవాడన్నారు. ఓసారి ఆల్ ఇండియా టోర్నమెంటులో ఆడుతున్న సమయంలో.. ప్రణవ్ తాను అవుటైన సమయంలో నవ్వడం చూశానని, అప్పుడు తనకు కోపం వచ్చిందన్నారు. రిప్లేలోను బిగ్ స్క్రీన్‌లో అది కనిపించిందన్నారు. అతను ఎప్పుడూ క్రికెట్ విషయంలో సీరియస్‌గా కనిపించలేదని, అతని తీరు తనకు ఆగ్రహం తెప్పించేదని, దీంతో అతనిని పలుమార్లు హెచ్చరించానని చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications