
తొలుత తటపటాయించిన జో రూట్ ఆ తర్వాత:
ఇన్నింగ్స్ 63వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్ వేస్తున్నాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జానీ బారిస్టో (70) 88 బంతుల్లో 9 ఫోర్లతో బంతిని లెగ్ గల్లీ దిశగా కొట్టాడు. అక్కడ ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో జోరూట్ 156 బంతుల్లో 9ఫోర్లతో (80) కలిసి ఒక పరుగు పూర్తి చేసిన బారిస్టో రెండో పరుగు కోసం అతడ్ని పిలిచాడు. అయితే.. అప్పటికే విరాట్ కోహ్లి బంతిని సమీపిస్తుండటంతో తొలుత తటపటాయించిన జో రూట్ ఆ తర్వాత పరుగుకు యత్నించాడు.
జో రూట్ డైవ్ చేసినా లాభం లేకపోయి:
కానీ.. వేగంగా బంతిని అందుకున్న కోహ్లి.. పడిపోయే పరిస్థితిలోనూ గురిచూసి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లపైకి బంతిని విసిరాడు. అక్కడే ఉన్న బౌలర్ అశ్విన్ తొలుత బంతిని అందుకునేందుకు ప్రయత్నించి.. అది నేరుగా వికెట్ల వైపు వెళ్తుండటాన్ని గమనించి చేతులను వెనక్కి తీశాడు. దీంతో.. వేగంగా వెళ్లిన బంతి వికెట్లను గీరాటేయగా.. క్రీజులోకి వచ్చేందుకు జో రూట్ డైవ్ చేసినా లాభం లేకపోయింది.
జో రూట్ వైపు చూస్తూ.. ఫ్లయింగ్ కిస్‌లు
తొలి సెషన్ నుంచి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన జో రూట్ పేలవ రీతిలో రనౌటవడం.. అదీ తాను రనౌట్ చేయడంతో.. కోహ్లి మైదానంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. పెవిలియన్‌కి వెళ్తున్న జో రూట్ వైపు చూస్తూ సంతోషంగా ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జానీ బారిస్టో కూడా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బంతిని వికెట్లపైకి ఆడుకుని ఔటయ్యాడు.

రూట్‌కు జత కలిసిన బెయిర్ స్టో
ఒకానొక దశలో రూట్‌కు జత కలిసిన బెయిర్ స్టో భారత బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. వీళ్లిద్దరూ దూకుడుగా ఆడుతూ.. భారత బౌలర్ల లయను దెబ్బ తీశారు. వంద భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. టీ విరామానికి స్కోరు 163/3 కాగా.. మూడో సెషన్లోనూ ఈ జోడీ జోరు కొనసాగించింది. స్కోరు 200 దాటింది. ఐతే ఇంగ్లాండ్ పూర్తిగా పట్టు సాధిస్తున్న సమయంలో రూట్ రనౌటవడంతో కథ మారిపోయింది.


Click it and Unblock the Notifications













