Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: మిగతా రెండు మ్యాచులు చాలా ఇంపార్టెంట్.. మళ్లీ ఫెయిలైతే అతని కెరీర్ అంతే!

Remaining two T20Is are very important for Shubman Gill

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ దిగ్గజం ఆసక్తికర కామెంట్స్ చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇషాన్ కిషన్‌తో పాటు గిల్‌ను ఓపెనర్‌గా పంపాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొన్న అతను కేవలం ఐదు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మహీష్ తీక్షణ వేసిన బంతిని పుల్ చేయబోయి ఫీల్డర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌కు గిల్ అసలు పనికొస్తాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ విషయంలో టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. తను గిల్‌ను పొట్టి ఫార్మాట్ ప్లేయర్‌గా చూడనని తేల్చిచెప్పాడు. గిల్ ఆటతీరు ఈ ఫార్మాట్‌కు సరిపోతుందని తాను అనుకోవడం లేదన్నాడు. 'గిల్ టెస్టు క్రికెట్ చాలా కాలం ఆడతాడు. భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కూడా అవ్వొచ్చు. అలాగే వన్డేల్లో కూడా చాలా కాలం ఆడి, చివరకు జట్టు పగ్గాలు అందుకోవచ్చు. కానీ టీ20 ఫార్మాట్‌లో రాణిస్తాడని నేను అనుకోవడం లేదు. అతన్ని చూస్తే పొట్టి ఫార్మాట్ ప్లేయర్ అని నాకు అనిపించదు' అని చోప్రా చాలా స్పష్టంగా చెప్పేశాడు.

Remaining two T20Is are very important for Shubman Gill

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లోనే ఈ ఫార్మాట్‌లో గిల్ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అతను తన వంటి వాళ్ల అభిప్రాయాలు తప్పని నిరూపించాలని ఆకాష్ చోప్రా అన్నాడు. 'అరంగేట్ర మ్యాచ్‌లో ఆడకపోవడం పెద్ద సమస్యే కాదు.

కానీ అతని ఆటతీరు చూసి నేను చెప్తున్న మాటలివి. ఇప్పుడు శ్రీలంకతో మిగిలిన రెండు మ్యాచులు గిల్‌కు మంచి అవకాశం. నా వంటి వారందరూ తన విషయంలో తప్పు అభిప్రాయంతో ఉన్నారని, మాదే తప్పు అని నిరూపించే ఛాన్స్ అతని వద్ద ఉంది. దీన్ని అతను ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఈ రెండు మ్యాచులు అతనికి చాలా ఇంపార్టెంట్' అని ఆకాష్ చోప్రా వివరించాడు.

Story first published: Thursday, January 5, 2023, 16:54 [IST]
Other articles published on Jan 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+