ఐపీఎల్ వేలానికి సిద్ధం: కోటికైనా కొనుక్కోమంటోన్న యువరాజ్!!

న్యూ ఢిల్లీ: సిక్సర్ల వీరుడు, విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారత వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డులు సృష్టించిన యువరాజ్ సింగ్.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతాడా..? లేదా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. 2019 వరల్డ్ కప్ సమయానికి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్న ఈ క్రికెటర్‌కు పేలవ ఫామ్ శాపంగా మారింది.

అనూహ్యంగా తన ధరని రూ. కోటికి
ఈ క్రమంలో జైపూర్ వేదికగా డిసెంబరు 18న ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుండగా.. యువరాజ్ సింగ్ తన ధరని అనూహ్యంగా రూ. కోటికి తగ్గించుకున్నాడు. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 70 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. భారత్ జట్టుకి గత ఏడాదిన్నరకాలంగా దూరంగా ఉంటున్న యువరాజ్ సింగ్.. ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడి ఘోరంగా విఫలమయ్యాడు.

సెహ్వాగ్ సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి
యువీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఈ వెటరన్ ఆల్‌రౌండర్ చేసిన పరుగులు 65 మాత్రమే. దీంతో.. ఓ 6మ్యాచ్‌ల్లో కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అతని పేలవ ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేసిన పంజాబ్ ఫ్రాంఛైజీ.. ఈ ఏడాది అట్టిపెట్టుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది. మరోలా చూస్తే, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్‌గా సెహ్వాగ్ ఉన్న సమయంలోనే యువరాజ్‌ను జట్టు కొనుగోలు చేసింది. ఇటీవల సెహ్వాగ్ సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి వైదొలుగుతున్నట్లు రాజీనామా ప్రకటించాడు.

రూ.కోటితోనే మార్కెట్‌లోకి రానున్న యువీ
కానీ, యువరాజ్ మాత్రం మళ్లీ సీజన్‌లో ఆడాలనే నెపంతో కనీస ధరను తగ్గించుకున్నాడు. గతేడాది సీజన్‌లో రూ. 2 కోట్లతో యువరాజ్ సింగ్ వేలంలోకి రాగా.. అదే ధరకి పంజాబ్ కొనుగోలు చేసింది. కానీ.. ఈ ఏడాది రూ.కోటితోనే రానున్నాడు. అయినప్పటికీ.. ఈ 36ఏళ్ల ఆల్‌రౌండర్‌ని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయడంపై అనుమానాలు లేకపోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications