టీ20ల్లో ఆ ఘనత సాధించిన ఆరో బ్యాటర్‌గా రీజా హెండ్రిక్స్.. పోరాడి ఓడిన ఐర్లాండ్

దక్షిణాఫ్రికా బ్యాటర్ రీజా హెండ్రిక్స్ టీ20లలో వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు చేసిన ఆరో బ్యాటర్‌గా నిలిచాడు. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హెండ్రిక్స్ ఈ ఘనతను సాధించాడు. టీ20ల్లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన వారిలో బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్), క్రిస్ గేల్ (వెస్టిండీస్), క్రెయిగ్ విలియమ్స్ (నమీబియా), రేయాంఖాన్ పఠాన్ (కెనడా), గుస్తావ్ మెక్‌కీన్ (ఫ్రాన్స్) అతని కంటే ముందున్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్ గెలవడంతో రీజా హెండ్రిక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలు చేసి రాణించాడు.
తొలుత మార్కరమ్, హెండ్రిక్స్ చెలరేగడంతో..
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 21పరుగుల తేడాతో గెలిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0ఆధిక్యంలోకి వెళ్లింది. హెండ్రిక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సేన్‌ల వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. అయితే హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్ ఇద్దరు ఇన్నింగ్స్ నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 112పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెండ్రిక్స్ (53 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు) హాఫ్ సెంచరీతో దడ పుట్టించగా.. మార్క్‌రామ్ (27 బంతుల్లో 2ఫోర్లు, 5 సిక్సర్లతో 56పరుగులు) చిచ్చురేపాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ కూడా 24పరుగులతో రాణించాడు. తద్వారా ఐర్లాండ్‌కు ముందు 212పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఉంచగలిగింది.
ఐర్లాండ్ ఏం తక్కువ తినలేదు
ఇకపోతే ఛేదనలో ఐర్లాండ్ ఏం తక్కువ తినలేదు. ఆ జట్టు కూడా గట్టి పోరాటాన్ని కనబర్చింది. ఆ జట్టు బ్యాటర్ లోర్కాన్ టక్కర్ (38బంతుల్లో 7ఫోర్లు 5సిక్సర్లతో 78పరుగులు) వీరవిహారం చేశాడు. అతని ధాటికి ఒకానొక దశలో ఐర్లాండ్ గెలిచేలా కన్పించింది. అతనికి తోడు జార్జ్ డోక్రెల్ (28 బంతుల్లో 43 పరుగులు) చెలరేగాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 86పరుగులు జోడించారు. అయితే త్వరత్వరగా వీరు ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా విజయం లాంఛనమైంది.
ఐర్లాండ్ :
పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), గారెత్ డెలానీ, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, ఆండీ మెక్‌బ్రైన్, జాషువా లిటిల్
దక్షిణాఫ్రికా :
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), లుంగి న్గిడి, తబ్రైజ్ షమ్సీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications