Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొల్‌కత్తాపై అలవోక విజయాన్ని నమోదు చేసిన రెడ్ బ్యాక్స్

kolkat Knight Riders
ఉప్పల్‌: చాంపియన్స్‌ లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వరసగా రెండో మ్యాచ్‌ కూడా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌ను సోమర్‌సెట్‌తో పొగుట్టుకున్న ఆ జట్టు మంగళవారం నాడు జరిగిన మ్యాచ్‌లో దక్షిణ ఆస్ట్రేలియాపై పందొమ్మిది పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఆ జట్టు పరిస్థితి డైలమాలో పడింది. మొదటగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణ ఆస్ట్రేలియా జట్టు ప్రారంభంలో కొంచెం తడబడినప్పటికీ ఫెర్గూసన్‌ నిలదొక్కుకోవటంతో భారీ స్కోరు వైపు పరుగులు పెట్టింది. ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సహాయంతో ఫెర్గూన్‌సన్‌ మొత్తం 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం 40 బంతుల్లోనే ఈ స్కోరు చేయడం జరిగింది.

తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ ఓటమితో కోల్‌కతా సెమీస్‌ అవకాశాలు క్లిష్టంగా మారాయి. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతాకు ఏదీ కలిసి రాలేదు. టాస్‌తో మొదలైన కోల్‌కతా కష్టాలు చివరి వరకు కొనసాగాయి. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌కు ఓపెనర్‌ మన్విందర్‌ బిస్లా కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. లియాన్‌ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అయితే రిచర్డ్‌సన్‌ వేసిన తర్వాతి ఓవర్లోనే బిస్లా ఔటయ్యాడు. ఆ దెబ్బకు కుప్పకూలిపోయిన కోల్ కత్తా మరలా ఇంక కొలుకోలేదు..

ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన సాకిబ్‌ అల్‌ హసన్‌ (13), కెప్టెన్‌ గంభీర్‌ (9), యూసుఫ్‌ పఠాన్‌ (5) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరారు. కలిస్‌ 19 బంతుల్లో 2ఫోర్లతో 20 పరుగులు సాధించి ఔటయ్యాడు. అయితే మనోజ్‌ తివారీ, డోస్చెట్‌ కొద్ది సేపు పోరాటాన్ని కొనసాగించారు. కొన్ని కళ్లు చెదిరే షాట్లు కొట్టిన తివారీ 31 బంతుల్లో రెండు సిక్స్‌లు, మరో రెండు ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు డోస్చెట్‌ 16 బంతుల్లోనే 3ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు సాధించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+