ఒకే రికార్డుని రెండు సార్లు నెలకొల్పిన ఆటగాళ్లు వీరే (ఫోటోలు)
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ ముగిసింది. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన పైనల్‌లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఐపీఎల్ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ పదేళ్ల ఐపీఎల్‌లో మళ్లీ సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే నలుగురు ఆటగాళ్లు ఒకే రికార్డును రెండు సార్లు నెలకొల్పారు.
ఒకే రికార్డుని రెండు సార్లు నెలకొల్పిన ఆటగాళ్లు:

రెండుసార్లు ఆరెంజ్ క్యాప్‌ని అందుకున్న క్రిస్‌గేల్, వార్నర్
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్లుగా క్రిస్‌గేల్, వార్నర్ రాణిస్తున్నారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో తమ బ్యాటింగ్‌తో అద్భుతాలు సృష్టించడంతో పాటు సరికొత్త రికార్డులను సృష్టించారు. క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

2017 ఆరెంజ్ క్యాప్ విజేతగా డేవిడ్ వార్నర్
వీరిద్దరూ రెండు సార్లు ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ అందుకొన్న జాబితాలో నిలిచారు. క్రిస్ గేల్ 2011లో 608 (12 ఇన్నింగ్స్‌ల్లో), 2012లో 733 (14 ఇన్నింగ్స్‌ల్లో) పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ 2015లో 14 ఇన్నింగ్స్‌ల్లో 563, 2017లో 14 ఇన్నింగ్స్‌ల్లో 641 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

రెండు సార్లు పర్పుల్ క్యాప్ సాధించిన భువీ, డ్వేన్ బ్రావో
వికెట్ల పరంగా చూస్తే డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు సార్లు పర్పుల్ క్యాప్ సాధించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ వరుసగా రెండు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2016లో 17 ఇన్నింగ్స్‌ల్లో 23, 2017లో 14 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ని అందుకున్నాడు.

డ్వేన్ బ్రావో
వెస్టిండిస్‌కు చెందిన ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 18 మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీసుకుని పర్పెల్ క్యాప్‌ని సొంతం చేసుకోగా, 2015లో 16 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ని అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications