ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డ్: పాక్‌పై గెలుపు వెనుక కారణం ఇదీ!
నాటింగ్ హామ్: పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆటగాళ్లు రెచ్చిపోయి 444 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు గెలుచుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు కూడా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
ఈ క్రమంలో అసలు ఇంగ్లిష్ జట్టు ఇంతలా చెలరేగిపోవడానికి ఓ కారణం కూడా ఉందట. తొలి టెస్టు ముగిసిన అనంతరం విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు ప్రవర్తన అని తెలుస్తోంది. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన అనంతరం తమకు శిక్షణ ఇచ్చిన పాకిస్థాన్ ఆర్మీకి గౌరవ సూచకంగా మార్చ్ ఫాస్ట్ చేసిన పాకిస్తాన్ జట్టు శాల్యూట్ చేసి, మైదానంలో సింబాలిక్‌గా పుషప్స్ తీసింది.

దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు మాజీలు పాక్ జట్టు తీరును తప్పుబట్టారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ పాక్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడే పాక్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించుకుంది. దానికి ప్రతీకారంగా టెస్టు సిరీస్‌లో వెనుకబడినా 2-2తో సిరీస్‌ను సమం చేసి సత్తా చాటింది. వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి, పాక్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. అందులో భాగంగానే నిన్నటి మ్యాచ్‌లో రెచ్చిపోయారట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications