Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విశాఖ టెస్టులో తిప్పేశాడు: అశ్విన్ ఖాతాలో మరో రికార్డు

విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 5 వికెట్లు తీసుకుని 67 పరుగులిచ్చి టెస్టు దిగ్గజాల సరసన చేరాడు.

అంతేకాదు ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 50 వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. తమిళనాడుకు చెందిన ఈ 30 ఏళ్ల స్ఫిన్నర్ 2016లో 9 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. దీంతో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 22 సార్లు 5 వికెట్లు తీసుకున్న ఆటగాళ్ల సరసన చేరాడు.

Ashwin claims 50 wickets in 2016

ఒకే సంవత్సరంలో 54 వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంకకు చెందిన రంగన హెరాత్‌ టెస్టు బౌలర్లలో అగ్ర స్థానంలో ఉన్నాడు. రంగన హెరాత్‌ ఈ ఘనతను 8 మ్యాచ్‌ల్లో 15 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా, అశ్విన్‌ 9 మ్యాచ్‌ల్లో 16 ఇన్నింగ్స్‌ల ద్వారా సాధించాడు. కాగా, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం (నవంబర్ 17)న రెండో టెస్టు ప్రారంభమైంది.

టాస్ గెలిచి రెండో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లాండ్‌ జట్టు 255పరుగులకే చేతులెత్తేసింది. శనివారం ఆటలో కీలక ఆటగాడు స్టోక్స్‌ వికెట్‌ తీయడంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ 2016 క్యాలెండర్‌ ఇయర్‌లో టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

దీంతో భారత్‌కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించడానికి గాను అశ్విన్ రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ హ్యాట్రిక్ వికెట్లు దక్కించుకునే అవకాశం పొందాడు. రెండో టెస్టులో అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ అశ్విన్‌ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+