Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: రాహుల్ త్రిపాఠీని ఓపెనర్‌గా పంపడమే బెటర్.. కారణాలివే..!

Reasons why Rahul Tripathi should be an opener

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠీ ఎట్టకేలకు భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అతనికి అవకాశం దక్కింది. తను ఆడిన తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోని త్రిపాఠీ.. ఆ తర్వాతి మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు.

వారిపై ఎదురుదాడికి దిగి 16 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని ఆటతీరే భారత ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేసింది. అలాంటి త్రిపాఠీని ఓపెనర్‌గా పంపితే బెటర్ అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోల్ అతనికేం కొత్తది కాదు. మరి అతన్ని ఓపెనర్‌గా ఎందుకు పంపాలనే కారణాలు చూస్తే..

సరైన ఓపెనర్లు లేరు

సరైన ఓపెనర్లు లేరు

టీమిండియాకు ఇటీవలి కాలంలో ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో సరైన ఆరంభాలు దొరకలేదు. టీ20 వరల్డ్ కప్‌ నుంచి భారత జట్టు ఓపెనర్ల సమస్యపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. శ్రీలంక సిరీస్‌లో కూడా ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో త్రిపాఠీ వంటి ఆటగాడు ఓపెనర్‌గా వస్తే.. తన ఫియర్‌లెస్ ఆటతో జట్టు ఇన్నింగ్స్‌ను సెట్ చేస్తాడని అభిమానులతోపాటు కొందరు నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ జోడీపై ఇప్పటికే పలువురు పెదవి విరుస్తుండగా.. గిల్ కూడా పొట్టి ఫార్మాట్‌కు పనికిరాడని లంక సిరీస్‌తో తేలిపోయింది. దీంతో త్రిపాఠీకి ఈ అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.

మిడిలార్డర్‌లో సూపర్ బ్యాటర్లు

మిడిలార్డర్‌లో సూపర్ బ్యాటర్లు

భారత జట్టు మిడిలార్డర్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా తదితరులతో టీమిండియా మిడిలార్డర్ చాలా బలంగా ఉంది. ఇంత మంది మంచి ఆటగాళ్లు ఉన్న మిడిలార్డర్‌లో త్రిపాఠీని చేర్చడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. దానికితోడు అక్షర్ పటేల్‌ను కూడా ముందుగా పంపితే.. మిడిలార్డర్‌లో ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో త్రిపాఠీని కూడా మిడిలార్డర్‌లో చేర్చడం, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు రాగానే బెంచ్‌కే పరిమితం చేయడం కన్నా ఓపెనర్‌గా అతన్ని పంపితే జట్టుకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది.

జట్టుకు అదే మేలు

జట్టుకు అదే మేలు

అటు స్పిన్నర్లను, ఇటు పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే ఇద్దరు ఆటగాళ్లు.. అదీ ధనా ధన్ ఆటతో ఆకట్టుకునే వాళ్లు క్రీజులో ఉంటే ఆ మజానే వేరు. వాళ్లిద్దరూ రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్ అయితే ఆ ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోతుంది. కాబట్టి వీళ్లిద్దరినీ మిడిలార్డర్‌లో దింపటం బాగానే ఉంటుంది.

అయితే మిడిల్ ఓవర్లలో జట్టును ఆదుకునే పనిని సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా వంటి వాళ్లు చక్కగా పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో త్రిపాఠీని ఓపెనర్‌గా పంపితే పవర్‌ప్లేలో జట్టుకు మంచి ఆరంభం లభించే అవకాశాలు మెరుగవుతాయి. ఆ తర్వాత మిడిలార్డర్‌లో సూర్య ఉండనే ఉన్నాడు. దీంతో భారత జట్టు ప్రతి ఫేజ్‌లోనూ ఒక అద్భుతమైన ఎటాకింగ్ ఆటగాడు ఉన్నట్లు కూడా ఉంటుంది.

Story first published: Monday, January 9, 2023, 10:24 [IST]
Other articles published on Jan 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+