Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa: రెండో టెస్టులో టీమిండియా ఓట‌మికి కార‌ణాలు ఇవే

Before this game, India had played five Tests at Johannesburg, winning two and drawing three.
Why Umpire Marais Erasmus Sarcastically Taunted Team India | Ind Vs Sa | Oneindia Telugu

జోహ‌న్నెస్‌బ‌ర్గ్ టెస్టు మ్యాచ్‌లో ఓడ‌డంతో టీమిండియా చారిత్రాత్మ‌క విజ‌యాన్ని అందుకునే అవ‌కాశాన్ని కోల్పోయింది. అంతేకాకుండా ఇప్ప‌టివ‌ర‌కు జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో ఓట‌మి ఎరుగ‌ని టీమిండియా.. ఈ సారి ఆ రికార్డును కొన‌సాగించ‌లేక‌పోయింది. దీంతో ఇప్పుడు టీమిండియా ఓట‌మికి కార‌ణాలు ఏంట‌ని అంతా చ‌ర్చించుకుంటున్నారు.

కోహ్లీ దూరమ‌వ‌డం మైన‌స్

కోహ్లీ దూరమ‌వ‌డం మైన‌స్

ఈ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూర‌మ‌వ‌డం టీమిండియాకు ప్ర‌ధాన మైన‌స్‌గా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ వెన్ను నొప్పి కార‌ణంగా మ్యాచ్ నుంచి త‌ప్పుకున్నాడు. టీమిండియా ప్ర‌ధాన బ్యాట‌ర్ అయినా కోహ్లీ లేని లోటు బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో స్పష్టంగా క‌నిపించింది. అలాగే అత‌ని కెప్టెన్సీ కూడా దూర‌మైంది. క‌ష్ట స‌మ‌యంలో మంచి నిర్ణ‌యాలు తీసుకునే కోహ్లీ లేక‌పోవ‌డంతో మ్యాచ్‌లో జ‌ట్టును న‌డిపించే విధానంపై ఎఫెక్టు చూపించింది. అంతేకాకుండా క‌ఠిన ప‌రిస్థితుల్లో కోహ్లీ బ్యాట్‌తోనే కాకుండా కెప్టెన్‌గానూ సత్తా చాటిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. అదే విధంగా జోహ‌న్నెస్ బ‌ర్గ్ పిచ్‌పై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. గ‌తంలో ఇక్క‌డ కోహ్లీ సెంచ‌రీ కూడా సాధించాడు.

కీల‌క టైంలో ప్ర‌ధాన బ్యాట‌ర్లు విఫ‌లం

కీల‌క టైంలో ప్ర‌ధాన బ్యాట‌ర్లు విఫ‌లం

టీమిండియా బ్యాటింగ్ టైంలో ఇటు ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో, అటు సెకండ్ ఇన్నింగ్స్‌లో కీల‌క స‌మ‌యంలో ప‌లు స్టార్ బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌వ‌డంతో జ‌ట్టు భారీ స్కోర్ సాధించ‌లేక‌పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రాహుల్, అశ్విన్ మినహా బ్యాటింగ్‌లో ఎవ‌రూ రాణించ‌లేక‌పోయారు. అదే విధంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ర‌హానే, పుజారా, విహారీ మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు రాణించ‌లేక‌పోయారు. దీంతో సౌతాఫ్రికా ముందు టీమిండియా భారీ టార్గెట్ ఉంచ‌లేక‌పోయింది.

ఫీల్డింగ్‌లో పొర‌పాట్లు

ఫీల్డింగ్‌లో పొర‌పాట్లు

ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో టీమిండియా ప‌లు పొర‌పాట్లు చేసింది. ముఖ్యంగా వికెట్ రిష‌బ్ పంత్ క్యాచ్‌లు జార విరచ‌డం మైన‌స్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో క్యాచ్ నెల‌పాలు చేసిన పంత్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో టెంబా బ‌వుమా క్యాచ్‌ను వ‌దిలిపెట్టాడు. దీంతో ఆ జ‌ట్టుకు క‌లిసొచ్చింది. ఇత‌ర ఫీల్డ‌ర్లు కూడా ప‌లు పొర‌పాట్లు చేశారు.

సిరాజ్‌కు గాయం

సిరాజ్‌కు గాయం

మ్యాచ్‌లో సిరాజ్‌ మంచి లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ స‌ఫారీ బ్యాట‌ర్ల‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. కానీ మ్యాచ్ మ‌ధ్య‌లో దుర‌దృష్టవ‌శాత్తూ సిరాజ్ గాయ‌ప‌డ్డాడు. ఆ త‌ర్వాత కూడా ప‌లు ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన‌ప్ప‌టికీ గాయం కార‌ణంగా రాణించ‌లేక‌పోయాడు. గాయం కార‌ణంగా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి సిరాజ్ 15 ఓవ‌ర్లే బౌలింగ్ చేశాడు.

కెప్టెన్‌గా నిరాశ‌ప‌రిచిన రాహుల్

కెప్టెన్‌గా నిరాశ‌ప‌రిచిన రాహుల్

ఈ మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో మొద‌టి సారి కెప్టెన్సీ చేసిన రాహుల్ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. అయితే మ్యాచ్‌కు ముందు కొన్ని నిముషాల ముందే కెప్టెన్‌గా బాధ్య‌త తీసుకోవాల్సి రావ‌డంతో అత‌ను సిద్దం కావ‌డానికి స‌రైన స‌మ‌యం ల‌భించ‌లేద‌నే చెప్పుకోవాలి. ఇక బౌల‌ర్ల‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డంలో రాహుల్ ఇబ్బందిప‌డ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల‌తో స‌త్తా చాటిన శార్దూల్ ఠాకూర్‌ను సెకండ్ ఇన్నింగ్స్‌లో లేట్‌గా బౌలింగ్‌కు తీసుకొచ్చాడు. అలాగే వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ చేతికి కూడా బంతిని ఆల‌స్యంగా ఇచ్చాడు.

బౌల‌ర్లు విఫ‌లం

బౌల‌ర్లు విఫ‌లం

ఈ మ్యాచ్‌లో భార‌త పేస‌ర్లు అంత‌గా రాణించ‌లేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఠాకూర్ 7 వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో ఆ లోటు క‌న‌ప‌డ‌లేదు కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం స్ప‌ష్టంగా క‌నిపించింది. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న బుమ్రా, ష‌మీ, సిరాజ్ నిరాశ‌ప‌రిచారు. ఇవ‌న్నీ కూడా జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో టీమిండియా తొలిసారి ఓడ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి.

Story first published: Friday, January 7, 2022, 12:20 [IST]
Other articles published on Jan 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+