CSK VS RR: ఐపీఎల్ టాప్ టీమ్స్‌లో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. స్టార్ ప్లేయర్ ధోనీ ఉన్న ఆ జట్టును జట్టును ఓడించడం అంత ఈజీ కాదనేది క్రికెట్ అభిమానుల వాదన. పైగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సీఎస్కేను అడ్డుకోవడమంటే దాదాపుగా అసాధ్యమే. అయితే ఈ ఇదంతా మొన్నటి వరకు. కానీ ఇప్పుడు తాజా సీజన్ లో చెన్నై జట్టు పేలవ ప్రదర్శనతో విమర్శలను మూటగట్టుకుంటోంది. ఐదు సార్లు టైటిల్ ఛాంపియన్ గా నిలిచిన ఆ జట్టు ఇప్పుడు వరుస ఓటములను అందుకుంటోంది. మొదట.. మరో మేటి జట్టు ముంబయి ఇండియన్స్ ను ఓడించి ఐపీఎల్ 2025 సీజన్ ను ఘనంగా ఆరంభించినా.. ఆ తర్వాత రెండు వరుస పరాజయాలను అందుకుంది. మొదట ఆర్సీబీపై సొండ గడ్డపైనే ఓడినా చెన్నై జట్టు.. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై కూడా ఓడిపోయింది. దీంతో సీఎస్కే.. ఈ సీజన్ లో రాణించడం అనుమానమే అని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజస్థాన్ పై సీఎస్కే ఓడిపోవడానికి 3 ప్రధాన కారణాలను తెలుసుకుందాం..
3.అశ్విన్ పేలవ బౌలింగ్..
ఐపీఎల్ లో బెస్ట్ స్పిన్ బౌలర్లలో ఒకడైన అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసినప్పుడు... క్రికెట్ అభిమానులు అంచనాలు రెట్టింపు అయ్యాయి. కానీ ఇప్పుడా అంచనాలు తారుమారు అయ్యాయి. ఎందుకంటే అతడు అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై 4 ఓవర్ల స్పెల్ వేసిన అతడు 1 వికెటే తీసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి పేలవ ప్రదర్శన కూడా చెన్నై ఓటమికి ఓ కారణం.
2.కివీస్ స్టార్ రచిన్ రవీంద్ర.. చెన్నై బ్యాటింగ్ యూనిట్ లో అతిపెద్ద బలం. అంతర్జాతీయ క్రికెట్ వరుస సెంచరీలు బాదే అతడు.. గత రెండు ఐపీఎల్ మ్యాచుల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. కానీ ఈ మ్యాచులో తొలి ఓవర్ లోనే అతడ వెనుదిరిగాడు. ఈ మ్యాచులో లక్ష్యం మరీ పెద్దది కాకపోయినా.. రచిన్ రవీంద్ర తొలి ఓవర్లోనే ఔట్ అవ్వడం వల్ల చెన్నై ఛేదన కష్టంగా సాగింది.
1. ఈ మ్యాచులో గువాహతి లాంటి పిచ్ పై ఈ లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ చెన్నై బ్యాటర్లు తడబడ్డారు. రచిన్ రవీంద్ర ఔట్ అయ్యాక వచ్చిన రాహుల్ త్రిపాఠి (23) కొన్ని షాట్లు బాగానే ఆడినప్పటికీ.. ఎనిమిదో ఓవర్లో వెనుదిరిగాడు. విజయ్ శంకర్ (9) కూడా నెం.5లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. వీరిద్దరు కొన్ని తప్పులు చేయడం కూడా చెన్నై ఓటమికి కారణమయ్యాయి.
