Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : మూడో టెస్టులో భారత్ ఘోర ఓటమికి కారణాలివే..!

Reasons for Team India loss in third INDvAUS

ఆసీస్‌పై వరుసగా రెండు టెస్టులు గెలిచిన భారత జట్టు.. మూడో టెస్టులో ఘోరంగా ఓడింది. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఏమాత్రం రాణించలేదు. దీంతో ఆసీస్ ముందు 76 పరుగుల టార్గెట్ మాత్రమే నిలిచింది. దీన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి కంగారూలు ఛేదించారు. ఇది హోల్కర్ స్టేడియంలో భారత్‌కు తొలి టెస్టు పరాజయం. అంతేకాదు, కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో రోహిత్‌కు కూడా తొలి ఓటమి. దీనికి కారణాలు ఏవని ఆలోచిస్తే..

ఇదేం ఆటతీరు?

ఇదేం ఆటతీరు?

ఇండోర్ పిచ్ నుంచి బౌలర్లకు భయంకరంగా సహకారం లభించింది. దీంతో బ్యాటర్లు తడబడ్డారు. అయితే ఇక్కడ ఎటాకింగ్ గేమ్ ఆడితే ఫలితం ఉంటుందని ఆసీస్ బ్యాటర్లు నిరూపించారు. కానీ భారత బ్యాటర్లు ఆ పని చేయలేకపోయారు. టీమిండియా ఓపెనర్లు కొంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోగా వికెట్లు కోల్పోయారు. దీంతో ఒత్తిడికి గురైన మిడిలార్డర్ డిఫెన్సివ్‌గా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ పిచ్‌పై డిఫెన్సివ్‌గా ఆడుతూ ఎక్కువ సేపు ఆడలేమని చాలా మంది నిపుణులు చెప్పారు కూడా. ఇదే భారత్‌ను దెబ్బ తీసింది. ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా ఎటాకింగ్ గేమ్ ఆడి, ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చెయ్యలేకపోయారు.

ఫామ్ ఉన్నా.. ఛాన్స్ లేదు..

ఫామ్ ఉన్నా.. ఛాన్స్ లేదు..

టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బ్యాటర్ అక్షర్ పటేల్. తొలి రెండు టెస్టుల్లో సూపర్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న అతనికి బౌలింగ్ చేసే అవకాశం అంత ఎక్కువ రాలేదు. మూడో టెస్టులో అతనికి బ్యాటింగ్ చేసే ఛాన్స్ కూడా దక్కలేదు. లియాన్ బౌలింగ్‌లో జడేజా కూడా తడబడ్డాడు. కానీ అక్షర్ మాత్రం ఎవరి బౌలింగ్ ఎదుర్కొంటున్నా క్రీజులో చాలా సెటిల్డ్‌గా కనిపించాడు. అతన్ని మిడిలార్డర్‌కు ప్రమోట్ చేసి ఉంటే భారత్ స్కోరు కనీసం 50-60 పరుగులు ఎక్కువగా ఉండేదే. కానీ జడ్డూను ప్రమోట్ చేసి అక్షర్‌ను చిట్టచివర్లో పంపడంతో అతను రెండు ఇన్నింగ్సుల్లోనూ చివరకు ఒంటరి పక్షిలా క్రీజులో మిగిలిపోయాడు.

ఒక్కరు కూడా ఆడలేదుగా..

ఒక్కరు కూడా ఆడలేదుగా..

ఈ టెస్టు సిరీసులో భారత బ్యాటింగ్ లైనప్ అంత అద్భుతమైన ఫామ్‌లో లేదు. తొలి టెస్టులో రోహిత్ సెంచరీ, మూడో టెస్టులో పుజారా హాఫ్ సెంచరీ తప్ప టీమిండియా టాపార్డర్‌లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే తొలి రెండు టెస్టుల్లో లోయర్ ఆర్డర్ ఆడటంతో బతికిపోయిన భారత జట్టు.. ఇండోర్ టెస్టులో అలా తప్పించుకోలేకపోయింది. భయంకరంగా టర్న్ అవుతున్న ఈ పిచ్‌పై లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. దీంతో భారత బ్యాటింగ్‌లో డొల్లతనం బయటపడింది. మిడిలార్డర్‌లో కోహ్లీ కొంత సెటిల్డ్‌గా కనిపించినా అదే ఊపులో భారీ స్కోరు చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. భరత్, శ్రేయాస్, జడేజా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారత బ్యాటింగ్ లైనప్ కనీసం పోటీ కూడా ఇవ్వకుండానే కుప్పకూలింది.

Story first published: Friday, March 3, 2023, 14:09 [IST]
Other articles published on Mar 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+