Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy PAK VS NZ: న్యూజిలాండ్ పై పాకిస్థాన్ ఓటమికి 5 కారణలివే!

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ ఓటమితో ఆరంభించింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన ఆరంభ మ్యాచ్ లో 60 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో తమ జట్టు ఓడిపోవడానికి కారణం.. డెత్ బౌలింగ్‌లో, పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసేటప్పుడు మూమెంట్ కోల్పోవడమేనని కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ అన్నాడు. దీంతో పాటే పలు కారణాలు కూడా ఉన్నాయి.

పవర్ ప్లేలో అదిరే ఓపెనింగ్ స్పెల్ - పాకిస్థాన్ తుస్సు..
పాకిస్థాన్ జట్టు అత్యంత పేలవంగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. మొదటి 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి కేవలం 22 పరుగులే చేసింది. షకీల్‌ (6), రిజ్వాన్‌ (3), బాబర్‌ అజామ్ పేలవ ప్రదర్శన చేశారు. మొత్తంగా తొలి పది ఓవర్లలోనే 45 డాట్ బాల్స్ పడ్డాయి. కివీల్ బౌలర్ ఒరూర్క్‌ 5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులే సమర్పించుకుని 2 వికెట్లు తీశాడు. దీంతో పాకిస్థాన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారీ స్కోర్ తో మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయింది.

Reasons for Pakistan s Defeat against New Zealand in Champions Trophy 2025

స్పిన్నర్ల వైఫల్యం
పాకిస్థాన్ ఓడిపోవడానికి ఆ జట్టు స్పిన్నర్ల వైఫల్యం కూడా ఒకటి. ఆ జట్టు కేవలం ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ తోనే బరిలోకి దిగింది. అతడే కివీస్ పై కాస్త పర్వాలేదనిపించే ప్రదర్శన చేశాడు. పాక్ పేసర్ల బౌలింగ్ దాటికి న్యూజిలాండ్ 22.3 ఓవర్లలో 100/3 స్కోరు చేసింది. ఆ సమయంలో అబ్రర్ అహ్మద్ కాస్త కివీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. అయితే పార్ట్ టైమ్ స్పిన్నర్స్ అయినా అఘా సల్మాన్, ఖుష్ దిల్ షాపై పాకిస్థాన్ ఆధారపడటం పాకిస్థాన్ కు దెబ్బకొట్టింది. వాళ్లు న్యూజిలాండ్ పై ఒత్తిడి తీసుకొచ్చి కీలక వికెట్లు తీయలేకపోయారు. దీంతో మిడిల్ ఆర్డర్ లో కివీస్ బ్యాటర్లలో యంగ్, లాథమ్ సెంచరీలతో చెలరేగారు.

మిడిలార్డర్ లో వారిద్దరి దూకుడు వల్ల...
న్యూజిలాండ్ మిడిలార్డర్ లో యంగ్, లాథమ్ చెలరేగి ఆడటం పాకిస్థాన్ వైఫల్యానికి కారణమైంది. వాస్తవానికి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను పేలవంగా ప్రారంభించింది. ఓ దశలో 74/3తో ఇబ్బంది పడింది. కానీ ఆ సమయంలో వచ్చిన యంగ్, లేథమ్‌ అదిరే శతకాలతో జట్టుకు భారీ స్కోరును అందించారు. ఈ జోడీ కష్టాల్లో ఉన్న ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరు కలిసి వికెట్ పడకుండా ఆడుతూ 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 38వ ఓవర్లో యంగ్‌ ఔటయ్యే సమయానికి కివీస్‌ స్కోరు 191/4 గా నిలిచింది. అనంతరం లేథమ్, ఫిలిప్స్ జంట కూడా‌ రెచ్చిపోవడంతో ఆఖరి 10 ఓవర్లలో కివీస్ కు‌ ఏకంగా 113 పరుగులు వచ్చాయి. ఈ ద్వయం ఆరో వికెట్‌కు 74 బంతుల్లోనే 125 పరుగులు నమోదు చేసింది.

Reasons for Pakistan s Defeat against New Zealand in Champions Trophy 2025

డెత్ ఓవర్లలో బౌలింగ్ వైఫల్యం

పాకిస్థాన్ బౌలర్లు డెత్ ఓవర్లలో సాధారణంగా బౌలింగ్ చేయడం వారిని కొంపముంచింది. చివరి 48 బంతుల్లో పాకిస్థాన్ 95 పరుగులు సమర్పించుకుంది. అదే న్యూజిలాండ్ కు కలిసొచ్చింది. గ్లెన్ ఫిల్పిప్స్ , లామ్ లాథమ్ కలిసి చివరి 74 బంతుల్లో 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫిలిప్స్ అయితే 39 బంతుల్లోల 61 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి.

చెత్త ఫీల్డింగ్..
ఫీల్డింగ్ లోనూ తేలిపోయింది పాకిస్థాన్. ఈ మధ్య రీసెంట్ మ్యాచులలో చెత్త ఫీల్డింగ్ చేస్తూ విమర్శలను మూటగట్టుకుంటోంది పాకిస్థాన్. బౌండరీ ఫీల్డింగ్ లో ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఇప్పుడు తాజా మ్యాచ్ లోనూ ఇలానే చెత్తగా ఆడింది.

Story first published: Thursday, February 20, 2025, 11:27 [IST]
Other articles published on Feb 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+