
నా చర్యలు క్షమించరానివి:
ఓలీ రాబిన్సన్ గత బుధవారం న్యూజిలాండ్‌తో ప్రారంభం అయిన తొలి టెస్ట్ ద్వారా ఇంగ్లండ్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. తొలిరోజే ఎనమిది ఏళ్ల క్రితం అతడు చేసిన వివాదాస్పద ట్వీట్లు (స్త్రీ వివక్ష, జాత్యంహకార) బయటపడ్డాయి. దీంతో రాబిన్సన్ క్షమాపణలు చెప్పాడు. 'నేను జాత్యహంకారిని, సెక్సిస్ట్‌ని కాదని స్పష్టం చేయాలనుకుంటున్నా. నా తప్పిదంకు తీవ్రంగా చింతిస్తున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడుతున్నా. ఆ సమయంలో నేను ఆలోచనా రహితంగా, బాధ్యతారహితంగా ఉన్నా. నా మానసికస్థితి సరిగా లేదు. నా చర్యలు క్షమించరానివి. ఆ ట్వీట్లకు పూర్తిగా చింతిస్తున్నా.ఇపుడు నేను ఒక వ్యక్తిగా పరిణతి చెందా' అని రాబిన్సన్ పేర్కొన్నాడు.

క్షమాపణ చెప్పినప్పటికీ:
ఓలీ రాబిన్సన్ క్షమాపణ చెప్పినప్పటికీ.. ఈసీబీ అతనిపై చర్యలు తీసుకుంది. రాబిన్సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. ఈసీబీ క్రమశిక్షణా విభాగం రాబిన్సన్ చేసిన ట్వీట్లపై దర్యాప్తు జరపనుంది. '2013లో స్త్రీ వివక్ష, జాత్యంహకార సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఇంగ్లండ్ మరియు సస్సెక్స్ బౌలర్ అయిన ఓలీ రాబిన్సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేశాం. అతడి ట్వీట్లపై దర్యాప్తు చేస్తున్నాం' అని ఈసీబీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాబిన్సన్ ఇంగ్లండ్ టెస్ట్ స్క్వాడ్ నుంచి తొలగించబడ్డాడు. ఇక రెండో టెస్టుకు అతని స్థానంలో మరో పేసర్‌ను ఇంగ్లండ్ తీసుకోనుంది.

పశ్చాత్తాపం చెందాడు:
తొలి టెస్టులో ఓలీ రాబిన్సన్ 7 వికెట్లతో పాటు 42 రన్స్ కూడా చేశాడు. మ్యాచ్ తరువాత ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ... 'ఓలీ రాబిన్సన్ బ్యాట్‌తో బాగా సహకరించాడు. బంతితో అతని ఆటతీరు అద్భుతంగా ఉంది. తొలి టెస్టులోనే ఉన్నతస్థాయి నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. రాబిన్సన్ ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్‌లో విజయవంతం అవుతాడు. మైదానంలో జరిగిన విషయాలకు సంబంధించి, ఇది మా ఆటలో ఆమోదయోగ్యం కాదు. అతని ట్వీట్ల విషయంలో మీడియా సంస్థలతో నేరుగా మాట్లాడాడు. చాలా పశ్చాత్తాపం చెందాడు. మేము అతనికి మద్దతు ఇవ్వాలి. ప్రతిఒక్కరికి ఐ ఓ గుణపాఠం అని నేను భావిస్తున్నా' అని అన్నాడు.

తొలి టెస్టు డ్రా:
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ గట్టెక్కింది. లార్డ్స్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసాంతం వెనుకబడినా చివరికు మ్యాచ్‌ను రూట్ సేన 'డ్రా' చేసుకోగలిగింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఆదివారం ఐదో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్లకు 170 రన్స్ చేసింది. ఓపెనర్ డామ్ సిబ్లే (207 బంతుల్లో 60 నాటౌట్) చివరి వరకు నిలువగా.. కెప్టెన్ జో రూట్ (40) రాణించాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన న్యూజిలాండ్ కొత్త ఓపెనర్ డేవాన్ కాన్వె (200: 347 బంతుల్లో 22x4, 1x6)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది.


Click it and Unblock the Notifications












