Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: వేలంలో వార్నర్ తక్కువ ధర పలకడం వెనుక సంచలన నిజాలు! ఆ త‌ప్పే కొంప‌ముంచిదా?

Reasons for David Warner lowest price in IPL 2022 mega auction

బెంగ‌ళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. ఫ్రాంచైజీల‌న్నీ త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను కోట్ల రూపాయలు కుమ్మ‌రించి కొనుకోలు చేశాయి. అయితే వేలం విష‌య‌మైచాలా మందికి ఒక విష‌యం మింగుడు ప‌డ‌డం లేదు. అదే డేవిడ్ వార్న‌ర్ వేలంలో త‌క్కువ ధ‌రకు అమ్ముడు పోవ‌డం. దీంతో దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వార్న‌ర్ రికార్డులు

వార్న‌ర్ రికార్డులు

ఐపీఎల్‌లో అత్యంత విజ‌యవంత‌మైన ఆట‌గాళ్ల‌లో డేవిడ్ వార్న‌ర్ ఒక‌డు. త‌న కెప్టెన్సీతోనూ ఆక‌ట్టుకున్నాడు. త‌న కెప్టెన్సీలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఓ సారి ట్రోఫీ కూడా అందించాడు. ఆ సీజ‌న్‌లో బ్యాట‌ర్‌గానూ వార్న‌ర్ అద‌ర‌గొట్టాడు. ఐపీఎల్‌లో ఏకంగా 41 స‌గ‌టుతో ప‌రుగులు సాధించాడంటేనే వార్న‌ర్ సత్తా ఏంటో అర్థం చేసుక‌వ‌చ్చు. ఈ లీగ్‌లో 40కి పైగా స‌గ‌టున్న అరుదైన ఆట‌గాడు వార్న‌ర్ మాత్ర‌మే. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 150 మ్యాచ్‌లు ఆడిన వార్న‌ర్ 41 స‌గ‌టుతో 5449 ప‌రుగులు చేశాడు. ఇందులో రికార్డు స్థాయిలో ఏకంగా 4 సెంచ‌రీలు, 50 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

గ‌తంలో కంటే స‌గం ధ‌ర‌

గ‌తంలో కంటే స‌గం ధ‌ర‌

అట్టి వార్న‌ర్ మెగా వేలంలో భారీ ధ‌ర ప‌లుకుతాడ‌ని అంతా ఆశించారు. కెప్టెన్సీ కూడా చేసే స‌త్తా ఉండ‌డంతో వేలంలో వార్న‌ర్‌కు తిరుగు లేదనుకున్నారు. ఈ క్ర‌మంలోనే మెగా వేలంలోకి 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో వ‌చ్చిన వార్న‌ర్ రికార్డు ధ‌ర ప‌లుకుతాడ‌ని అంతా అంచనా వేశారు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 6 కోట్ల‌ 25 ల‌క్ష‌ల ధర మాత్ర‌మే ప‌లికాడు. ఈ ధ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌న్ని కొనుగోలు చేసింది. దీంతో అత‌ని అభిమానులు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. ఈ ధ‌ర గ‌తంలో వార్న‌ర్‌కు స‌న్‌రైజ‌ర్స్ ఇచ్చిన దానిలో స‌గ‌మే. గ‌త సీజ‌న్లో వార్న‌ర్‌కు స‌న్‌రైజ‌ర్స్ 12 కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చింది. అయితే వార్న‌ర్ ఇంత త‌క్కువ ధ‌ర ప‌ల‌క‌డానికి గ‌ల పలు కార‌ణాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

యాజమాన్యంతో విభేదాలు

యాజమాన్యంతో విభేదాలు

గ‌త సీజ‌న్లో డేవిడ్ వార్న‌ర్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే అనూహ్యంగా లీగ్ ఆరంభంలోనే డేవిడ్ వార్న‌ర్‌కు, స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యానికి మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయి. దీనికి తోడు వార్న‌ర్ ఆ స‌మ‌యంలో ఫాం కూడా కోల్పోయాడు. దీంతో అత‌న్ని స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్సీ నుంచే కాకుండా, తుది జ‌ట్టు నుంచి కూడా తొల‌గించింది. నిజానికి ఇక్క‌డ వార్న‌ర్ ఫాంలో లేడ‌నే కార‌ణం కాకుండా, య‌జామాన్యంతో అత‌నికి వ‌చ్చిన విబేధాల కార‌ణంగానే తుది జ‌ట్టు నుంచి త‌ప్పించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

విభేదాల‌కు కార‌ణం

విభేదాల‌కు కార‌ణం

అస‌లు వార్న‌ర్‌కు, స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యానికి మ‌ధ్య విభేదాలు రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే ఐపీఎల్ 2021లో భాగంగా జ‌రిగిన ఓ లీగ్ మ్యాచ్‌లో జ‌ట్టు ఓడిపోయింది. ఓట‌మి అనంత‌రం అప్ప‌టి కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ మాట్లాడుతూ తుది జ‌ట్టు నుంచి కొంద‌రు ఆట‌గాళ్ల‌ను తాను చెబుతున్న వినిపించుకోకుండా అన‌వ‌స‌రంగా తొల‌గించార‌ని, వాళ్లు ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లమ‌ని చెబుతూ మేనేజ్‌మెంట్ ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో మ‌నీష్ పాండే వంటి ఒక‌రి ఇద్ద‌రి ఆటగాళ్ల‌ను మేనేజ్‌మెంట్ ఆడించ‌లేదు. దానిని వార్న‌ర్ ఇష్ట‌ప‌డ‌లేదు. మ‌నీష్ పాండే స్థానంలో తీసుకున్న ఆట‌గాడు విఫ‌ల‌మ‌వ‌డంతో ఆ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోయింది. సునాయ‌స ల‌క్ష్యాన్ని కూడా చేధించ‌లేక‌పోయింది. ఇలా వార్న‌ర్ యాజ‌మాన్యాన్నికి ఎదురు తిర‌గ‌డంతోనే అత‌న్ని తుది జ‌ట్టు నుంచి తొల‌గించార‌ని స‌మాచారం.

అందుకే త‌క్కువ ధ‌ర‌

అందుకే త‌క్కువ ధ‌ర‌

అయితే ఇలా వార్న‌ర్ యాజ‌మాన్యానికి ఎదురు తిర‌గ‌డం చూసి అత‌న్ని వేలంలో కొనుగోలు చేయ‌డానికి మిగ‌తా టీంలు భ‌య‌ప‌డ్డాయ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు. రేప‌టి రోజుల్లో త‌మ టీంలో కూడా వార్న‌ర్ మేనేజ్‌మెంట్‌కు ఎదురు తిరిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని భావించి ఉంటాయ‌ని చెబుతున్నారు. అందుకే వార్న‌ర్‌ను కొనుగోలు చేయ‌డానికి టీంలు అంత‌గా ఆస‌క్తి చూప‌లేద‌ని, దీంతో ఫాంలో ఉన్న త‌క్కువ ధ‌ర వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కొనుగోలు చేసి రిస్క్ చేయ‌డం ఎందుక‌ని అనుకుని ఉంటాయ‌ని చెబుతున్నారు. ఈ ఒక్క త‌ప్పు ఆ స‌మయంలో వార్నర్ చేసి ఉండ‌క‌పోతే ఇప్పుడు ప‌రిస్థితి మ‌రొలా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికి తోడు వార్న‌ర్ వ‌య‌సు కూడా ప్ర‌స్తుతం 35 సంవ‌త్సారాలు. ఈ వ‌య‌సులో వార్న‌ర్‌ గ‌తంలో మాదిరిగా రాణించలేడ‌ని కూడా ఫ్రాంచైజీలు భావించిన‌ట్లు తెలుస్తోంది.

Story first published: Monday, February 14, 2022, 18:09 [IST]
Other articles published on Feb 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+