For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: పూజారాను జట్టు నుంచి తొలగించడానికి మరో కారణం ఇదే! కోహ్లీకి ప్రమోషన్ పక్కా!

Reason For Cheteshwar Pujara Removal From Playing 11 For England Tour

హైదరాబాద్: గతకొన్నాళ్లుగా బ్యాటింగ్​లో విఫలమవుతున్న టీమిండియా నయావాల్, టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారాను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో కీలకమైన మూడో స్థానంలో పుజారా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యట్లేదు. దీంతో ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్​తో జరిగే ఐదు టెస్టుల సిరీస్​లో అతడు బెంచ్​కే పరిమితమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్​ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

స్ట్రైక్ రేట్ దారుణం:

స్ట్రైక్ రేట్ దారుణం:

దిగ్గజం ​రాహుల్ ద్రవిడ్ అనంతరం భారత జట్టుకు మూడో స్థానంలో చేతేశ్వర్ పుజారా ఎంతో సేవచేశాడు. ఈ క్రమంలో నయా వాల్​గా పేరొందాడు. పుజారా సాధారణ టెస్టు సగటు 46.49. అయితే 2020 నుంచి అతడు ఆడిన మూడు సిరీస్​లను పరిశీలిస్తే.. సగటు 26.35కే పరిమితమైంది. గత 30 ఇన్నింగ్స్​లో పుజారా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అందులో 9 మ్యాచ్​లు సింగిల్ డిజిట్​ స్కోర్​కే వెనుదిరిగాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్టులో 77 పరుగులు చేసి పర్వాలేదు అనిపించినా.. మిగతా మ్యాచ్​ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఇక స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా ఉంటోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 34 బంతులు ఆడికాని పరుగుల ఖాతా తెరవలేదు.

పూజారా సగటు 29.00:

పూజారా సగటు 29.00:

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చేతేశ్వర్ పూజారా బ్యాటింగ్ సగటు కూడా అతడిని తొలగించాలనడానికి బలమైన మరో కారణంగా కనబడుతోంది. డబ్ల్యూటీసీలో మూడో స్థానంలో ఆడిన ఆటగాళ్ల బ్యాటింగ్ సగటును ఓసారి పరిశీలిస్తే.. ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషెన్ టాప్‌లో ఉన్నాడు. లబుషెన్ సగటు 73.10గా ఉంది. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సగటు 61.20గా, పాకిస్తాన్ కెప్టెన్ అజర్ అలీ సగటు 44.13గా, ఇంగ్లండ్ సారథి జో రూట్ సగటు 32.91గా, బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హుస్సేన్ సగటు 31.10 ఉండగా.. పూజారా సగటు మాత్రం 29.00గా ఉంది. ఇది భారత జట్టును కలవరపెడుతోంది.

 మూడో స్థానంలో కోహ్లీ:

మూడో స్థానంలో కోహ్లీ:

ఇటీవలి కాలంలో చేతేశ్వర్ పూజారా సగటు మాత్రం 29.00గా ఉండడంతో.. ఆరంభంలో పరుగులు రావడం కష్టమవుతోంది. కీలకమైన మూడో స్థానంలో వేగంగా పరుగులుచేయకపోడంతో తర్వాతి బ్యాట్స్‌మన్‌పై భారం పడుతోంది. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కాబట్టి పుజారాపై వేటు వేసి.. కెప్టెన్ విరాట్ కోహ్లీని మూడో స్థానంలో ఆడించచే అవకాశాలు ఉన్నాయి. పుజారాకు బదులు కేఎల్​ రాహుల్​, హనుమాన్ విహారిలో ఎవరో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు కోహ్లీ నాలుగో స్థానంలో కాకుండా.. మూడో స్థానంలో ఆడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పుజారాకు అండగా సన్నీ:

పుజారాకు అండగా సన్నీ:

అయితే చెతేశ్వర్‌ పుజారాకు దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్ అండగా నిలిచారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓటమికి అతడిని నిందిస్తే ఏం చేయలేమని తెలిపారు. న్యూజిలాండ్‌ క్రికెటర్లు సైతం నెమ్మదిగానే ఆడారని గుర్తు చేశారు. 'పుజారాను వేలెత్తి చూపుతూ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడం కష్టం. అతడు డిఫెన్స్‌తో అడ్డుగోడగా నిలబడతాడు. భారత ఇన్నింగ్స్‌లకు ప్రాముఖ్యం తీసుకొస్తాడు. ఒక ఎండ్‌లో పాతుకుపోయి మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా ఆడేందుకు వీలు కల్పిస్తాడు' అని సన్నీ మద్దతుగా నిలిచారు. మరి ఇంగ్లండ్​తో జరిగే టెస్టు సిరీస్​లో పుజారా ఆడతాడో లేదో చూడాలి.

Story first published: Monday, June 28, 2021, 14:36 [IST]
Other articles published on Jun 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+