Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ముంబై ఇండియన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్స్‌ బయటపెట్టిన సూర్యకుమార్!!

Really Funny: Suryakumar Yadav revels Mumbai Indians dressing room atmosphere

చెన్నై: ముంబై ఇండియన్స్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తమ డ్రెస్సింగ్ ‌రూమ్‌లో ఉండే సీక్రెట్స్‌ను బయటపెట్టాడు. అయితే సూర్య బయటపెట్టిన సీక్రెట్స్‌ జట్టుకు సంబందించినవి ఏమాత్రం కాదు. డ్రెస్సింగ్ ‌రూమ్‌లో తమ సహచరులు హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌, ఇషాన్‌ కిషన్ ఎలా అల్లరి చేస్తారో చెప్పాడు. మైదానం ఆవల తమ జట్టు పూర్తి భిన్నంగా ఉంటుందని సూర్య‌ తెలిపాడు. అందులో విచిత్రమైన మనస్తత్వాలు కనిపిస్తాయని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 శుక్రవారం ప్రారంభం కానుంది. ముంబై తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 9న చెన్నై వేదికగా ఆర్‌సీబీతో ఆడనుంది.

ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ ఇంటర్య్వూలో మాట్లాడాడు. 'ముంబై డ్రెస్సింగ్‌ రూమ్‌ నాకు వింతగా కనిపిస్తుంది. మైదానంలో చూసిందానికి వ్యతిరేకంగా ఉంటుంది. అక్కడి వాతావరణాన్ని సరదాగా మార్చేసే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఆటగాళ్లు ఉంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎప్పుడు ఫన్నీ వాతావరణమే కనిపిస్తుంది. అయితే వారిని ఇంకో కోణంలో చూస్తే కచ్చితంగా షాక్‌ అవుతారు. మ్యాచ్‌ గెలిచినా.. ఓడినా వారు ఫన్నీగానే ఉంటూ మమ్మల్ని సంతోషపెడుతారు' అని అన్నాడు.

'మ్యాచ్‌ గెలిస్తే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆహ్లదకర వాతావరణం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్‌ ఓడిపోయినా అదే విధంగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. గెలిచినా.. ఓడినా.. ఒకే రకంగా ఉండటం ద్వారానే మనలో అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టేందుకు ఆస్కారం ఉంటుంది' అని సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకోచ్చాడు. అయితే సూర్య డ్రెస్సింగ్‌ రూమ్‌ సీక్రెట్స్‌ రివీల్‌ చేయడంపై ఫ్యాన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 'సూర్య.. డ్రెస్సింగ్ ‌రూమ్‌ సీక్రెట్స్‌ అలా బయటపెడతారా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఏయ్.. సూర్య! అలానేనా చెప్పేది?' అని మరొకరు ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌ టైటిల్ ‌(2019, 2020) సాధించాలని ఉ‍వ్విళ్లూరుతుంది. ముంబై జట్టులో ఉన్న రోహిత్‌ శర్మ సహా సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌, జస్ప్రీత్ బుమ్రాలు మంచి ఫామ్‌లో ఉండడం సానుకూలాశంగా మారింది. వీరందరూ ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన వాళ్లే. ఇక ఇటీవల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న పొలార్డ్‌ తొలిసారి నెట్స్‌లో సాధన చేశాడు. ఈ విండీస్‌ హార్డ్‌హిట్టర్‌ పలు రకాల షాట్లు ఆడాడు.

Story first published: Thursday, April 8, 2021, 22:06 [IST]
Other articles published on Apr 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+