ప్రతి మ్యాచ్ ముగింపులానే ఉంటుంది: గంగూలీ

కోల్‌కతా: ఆస్ట్రేలియా పర్యటనలో 4 టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆడిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది టీమిండియా. ఈ విజయంపై కోహ్లీసేనను మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభినందించారు. పర్యటనలో మున్ముందు పోటీ మరింత పెరగనుందని చెప్పాడు. తొలి టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను తొలి టెస్టులో ఓడించింది.

బౌలర్లు విజృంభించడంతో
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 250 పరుగులు చేయగా ఆసీస్ 235కు పరిమితమైంది. ఇలా 15పరుగుల ఆధిక్యాన్ని సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసి 323 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తీవ్రమైన పోటీనిచ్చిన ఆసీస్ జట్టు ఛేదనలో 291 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్, షమి, బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు.

ప్రతి మ్యాచ్ ముగింపులానే
‘చాలా గొప్ప విజయం. పోరు హోరాహోరీగా సాగింది. సిరీస్ ఇంకా కఠినంగా సాగనుంది. అన్ని మ్యాచ్‌లు ఫలితం దిశగా సాగుతాయి. ప్రతి మ్యాచ్‌లోనూ ఇదే ముగింపు మ్యాచ్ అనే తరహాలో కోహ్లీసేన నిజంగానే తీవ్ర పోటీని ఎదుర్కొంది. ఛెతేశ్వర్ పుజారా, రహానెతో పాటు బౌలర్లు రాణించి జట్టును పోటీలో నిలిపారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది' అని గంగూలీ టీమిండియాను అభినందించాడు.

గంగూలీ ఒక్క సిరీస్ కూడా..
గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క సిరీస్‌లోనూ గెలవలేదు. కేవలం 2003-04లో మాత్రం ఒక్కటి డ్రాగా ముగించింది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications