Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన ఫేవరేట్ జట్టు 'రోహిత్‌'కు ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా?!!

Real Madrid present Rohit Sharma with customised jersey at Bernabeu


మాడ్రిడ్‌: టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ కుటుంబ సమేతంగా స్పెయిన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. 'లా లిగా' ఫుట్‌బాల్‌ లీగ్‌లో భాగంగా సాంటియాగో బెర్నాబూ స్టేడియంలో రియల్‌ మాడ్రిడ్-బార్సిలోనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను రోహిత్‌ వీక్షించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఫేవరెట్‌ జట్టు మాడ్రిడ్‌ 2-0తో బార్సిలోనాపై విజయం సాధించింది. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన రోహిత్‌కు రియల్‌ మాడ్రిడ్‌ జట్టు తమ జెర్సీని అందించి ప్రత్యేకంగా గౌరవించింది.
రియల్ మాడ్రిడ్‌ జెర్సీ:

రియల్ మాడ్రిడ్‌ జెర్సీ:

'రో' అనే పేరుతో 45 నంబర్‌ ఉన్న జెర్సీని రియల్‌ మాడ్రిడ్‌ జట్టు మంగళవారం రోహిత్‌కు అందించింది. భారత జెర్సీపై కూడా రోహిత్‌ది 45వ నంబరే అన్న విషయం తెలిసిందే. రోహిత్‌కు జెర్సీ ఇస్తున్న ఫొటోని రియల్‌ మాడ్రిడ్‌ జట్టు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 'రోహిత్‌ శర్మ బెర్నాబూకి రావడం గొప్పగా ఉంది' అని రాసుకొచ్చింది. రోహిత్‌ కూడా తన ఇన్‌స్టాలో ఆ ఫొటోని షేర్ చేశాడు. స్వాగతం పలికిన రియల్ మాడ్రిడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

సమైరాతో సందడి:

సమైరాతో సందడి:

అంతకుముందు మాడ్రిడ్ నగరాన్ని సందర్శించడానికి సహాయం చేసినందుకు 'లా లిగా' నిర్వాహకులు, రియల్ మాడ్రిడ్‌ జట్టుకు రోహిత్ శర్మ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ పర్యటన అద్భుతంగా సాగిందని, ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిందని రోహిత్ పేర్కొన్నాడు. రెండు రోజుల క్రితం సాంటియాగో బెర్నాబూ స్టేడియంలో భార్య రితిక, కూతురు సమైరాతో రోహిత్ సందడి చేసాడు.

న్యూజిలాండ్‌ పర్యటనలో గాయం:

న్యూజిలాండ్‌ పర్యటనలో గాయం:

రోహిత్‌ శర్మకు న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో పిక్క గాయం అయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం అవ్వడంతో కివీస్ సిరీస్ మధ్య నుంచే రోహిత్ స్వదేశానికి తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హిట్‌మ్యాన్‌.. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే స్పెయిన్ ట్రిప్ వెళ్ళాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌తో పునరాగమనం:

కివీస్‌తో ముగిసిన వన్డే, టెస్ట్ సిరీస్‌లలో హిట్‌మ్యాన్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టులో లేకపోవడం కివీస్‌కు సానుకూలాంశంగా మారింది. హిట్‌మ్యాన్‌ జట్టులో ఉంటే వన్డే, టెస్ట్ సిరీస్‌లను భారత్ కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్‌ మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Story first published: Wednesday, March 4, 2020, 13:30 [IST]
Other articles published on Mar 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+