Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'పాక్ జట్టుకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా'.. యువరాజ్ తండ్రి సంచలన ప్రకటన

Yograj Singh:ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్, భారత్ లపై వరుస పరాజయాల తర్వాత పాక్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ విషయం పాకిస్థాన్ జట్టు అభిమానులందరినీ షాక్ కు గురి చేసింది. ఈ క్రమంలో చాలా మంది పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాకిస్థాన్ జట్టులోని కోచ్, కెప్టెన్ సహా ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ పాక్ జట్టుకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ భారత జట్టు తరఫున ఒక టెస్ట్, ఆరు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఆయన ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా పాకిస్థాన్ జట్టుపై విమర్శలు గుప్పించారు.

Ready to Help Pakistan Team Yograj Singh s Shocking Statement

పాక్ జట్టు గురించి యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. వసీం అక్రమ్ లాంటి దిగ్గజాలు ఏం చేస్తున్నారో తెలియట్లేదని.. క్రికెట్ కామెంట్రీ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఎద్దేవా చేశారు. మీరందరూ మీ దేశాలకు వెళ్లి క్రికెట్ అకాడమీలను నిర్వహించి అక్కడి ఆటగాళ్లకు సహాయం చేయాలని సూచించారు. మీలో ఎవరు పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలవడానికి ఇలా చేస్తారో చూడాలనుకుంటున్నానని పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ను మళ్లీ ఎవరు ఛాంపియన్ గా చేస్తారో తాను చూడాలనుకుంటున్నానని.. 'లేకుంటే నేను పాకిస్థాన్ కు వెళ్తాను.. నాకు జట్టును ఇవ్వండి' అంటూ యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Take a Poll

ఒక సంవత్సరంలో పాక్ కొత్త టీంను నిర్మించి విజయవంతం చేస్తానని.. ఆ తర్వాత మీరు దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని యోగరాజ్ సింగ్ అన్నారు. యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ సొంతంగా క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ఆయన అర్జున్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు.

Story first published: Wednesday, February 26, 2025, 8:45 [IST]
Other articles published on Feb 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+