RCB VS RR: ఐపీఎల్ 2025 సీజన్ లో విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 5 హాఫ్ సెంచరీలతో 374 పరుగులు చేశాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులోనూ అదిరే ప్రదర్శన చేశాడు. 32 బంతుల్లో 51 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచులో 42 బంతుల్లో ఎదుర్కొన్న కోహ్లీ.. 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 70 పరుగులు చేశాడు. జట్టు భారీ స్కోరు చేయడంతో పాటు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో ఈ సీజన్ లో హోమ్ స్టేడియంలో ఎట్టకేలకు ఆర్సీబీ తొలి విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచులో 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 194 మాత్రమే చేసి మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఆఖరి ఓవర్లలో హెజిల్ వుడ్ మ్యాచ్ అద్భుతంగా ఆర్సీబీపై మలుపు తిప్పాడు. అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత ఆనందం వ్యక్తం చేసిన కోహ్లీ (Virat Kohli).. హోం స్టేడియంలో మ్యాచ్ గెలవడానికి గల కారణాన్ని వివరించాడు.

మా ప్లాన్ అదే..
"చాలా సంతోషంగా ఉంది. మా బ్యాటింగ్ యూనిట్ కలిసి కొన్ని విషయాలు చర్చించుకున్నాం. వాటిని అమలు చేసి.. మంచి స్కోరు చేయగలిగాం. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ చాలా బాగా సాయపడింది. రాజస్థాన్ రాయల్స్ బాగా ఆడింది. వాళ్లు మంచి షాట్లు ఆడారు. కానీ మేము తిరిగి మ్యాచులో పంజుకుని 2 పాయింట్లు అందుకోవం ఎంతో కీలకం. ఈ పిచ్ పై టాస్ గెలవడమే మొదటి సవాల్. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కాస్త అనుకూలంగా ఉంటుంది. మునుపటి కొన్ని మ్యాచ్‌ల్లో మంచి స్కోరు చేయాలని కాస్త కష్టపడ్డాం. కానీ ఈరోజు సాఫీగా వెళ్లిపోయింది. ఈ రోజు మా టెంప్లేట్ ఒక ఆటగాడు పూర్తిగా ఇన్నింగ్స్ నిలబెట్టాలి, మిగతావారు ఫ్రీగా ఆడాలి. ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది."
టెక్నిక్ ఇప్పుడు అర్థమైంది..
"మొదటి 3-4 ఓవర్లలో పేస్,బౌన్స్ ఉంటుంది. అయితే గత 3 మ్యాచ్‌ల్లో మేము బలవంతంగా చాలా షాట్లు ఆడడానికి ప్రయత్నించాము. కానీ ఈరోజు బంతి దగ్గర వరకు వచ్చే వరకు ఉండి, అందుకు తగినట్టుగా అడ్జస్ట్ అయి ఆడాము. ఇది మాకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు మేము ఎలా బ్యాటింగ్ చేయాలో గుర్తించాం. రాబోయే హోం మ్యాచుల్లో మేము మరింత బలంగా ఆడగలమని అనుకుంటున్నాం. అలానే అదనంగా మరో 15-20 పరుగులు కూడా చేయగలుగుతాం. ఈ స్టేడియం IPLలో క్రికెట్ ఆడేందుకు బెస్ట్ మైదానం. మా అభిమానులు మంచి, క్లిష్ట సమయాల్లో మాకు మద్దతుగా నిలిచారు. ఈ వేదిక నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడ చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయి." అని విరాట్ పేర్కొన్నాడు.