RCB vs SRH: చహల్ మాయ.. అదరగొట్టిన సైనీ.. సన్‌రైజర్స్‌పై బెంగళూరు విక్టరీ!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13వ సీజన్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ 10 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (3/18), పేసర్ నవదీప్ సైనీ (2/25), ఆల్‌రౌండర్ శివమ్ దుబే (2/15) కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో బెంగళూరు తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (61; 43 బంతుల్లో 6x4, 2x6) పోరాటం వృధా అయింది. హాఫ్ సెంచరీ చేసినా.. జట్టును గెలిపించలేకపోయాడు.

ఆదుకున్న బెయిర్‌స్టో:
164 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(6) అనూహ్యంగా రనౌట్ కావడంతో జానీ బెయిర్‌స్టోపై భారం పడింది. మనీశ్ పాండే (34)తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ ఉన్నంతసేపు ఆరెంజ్ ఆర్మీ గెలుపై ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే పాండేను ఔట్ చేసిన చహల్ 71 పరుగుల భాగస్వామ్యాన్ని తెరదించాడు. ఇక 16వ ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్లో చహల్ వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వరుస బంతుల్లో బెయిర్ స్టో (61) ను బౌల్డ్ చేసిన చహల్.. ఆ తర్వాత బంతికి విజయ్ శంకర్ (0)ను బౌల్డ్ చేశాడు. చహల్ ఇచ్చిన బ్రేక్‌తో ఆర్సీబీలో ఉత్సాహం వచ్చింది. అదే సమయంలో సన్‌రైజర్స్ ఢీలా పడింది.

చహల్ మాయ:
ఐదో వికెట్‌గా ప్రియాం గార్గ్ (12)ను శివం దూబే ఔట్ చేయడంతో ఆర్సీబీ 129 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. కాసేపటికి అభిషేక్ శర్మ (7) రనౌట్ కావడంతో రైజర్స్ తేరుకోలేకపోయింది. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన రషీద్ ఖాన్ ఊపుమీద కనిపించాడు. వచ్చీ రావడంతోనే దూబే బౌలింగ్‌లో ఫోర్ కొట్టాడు. కానీ 17 ఓవర్‌లో పరుగు కోసం యత్నించే క్రమంలో రషీద్ ఖాన్-అభిషేక్ పిచ్ మధ్యలో ఢీకొనడంతో కింద పడిపోయారు. దాంతో అప్పటికే కీపర్ వద్దకు చేరిన బంతితో అభిషేక్ రనౌట్ అయ్యాడు. ఆపై భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్ వచ్చినా త్వరగానే పెవిలియన్ చేరాడు. చివరి వికెట్‌గా సందీప్ శర్మ (9) ఔట్ కావడంతో సన్‌రైజర్స్ ఇంకా రెండు బంతులు ఉండగానే ఓటమి పాలైంది. చహల్ మూడు వికెట్లతో సన్‌రైజర్స్ ఓటమిని శాసించాడు.

పడిక్కల్ ఫటాఫట్:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (56; 42 బంతుల్లో 8x4), ఆరోన్ ఫించ్ (29; 27 బంతుల్లో 1x4, 2x6) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించాక వరుస బంతుల్లో ఔటయ్యారు. తొలుత విజయ్ శంకర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి దేవ్‌దత్ క్లీన్‌బౌల్డ్ కాగా.. తర్వాత 12వ ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఫించ్ ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం కోహ్లీ (14), డివిలియర్స్ (51: 30 బంతుల్లో 4×4, 2×6) కాసేపు వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించారు.

డివిలియర్స్ హాఫ్ సెంచరీ:
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ భారీ షాట్ ఆడబోయి బౌండరీలైన్ వద్ద రషీద్ ఖాన్ చేతికి చిక్కాడు. ఆపై శివమ్ దూబె(7) క్రీజులోకి రాగా.. డివిలియర్స్‌కే ఎక్కువ అవకాశం ఇచ్చాడు. దీంతో చివర్లో గేర్ మార్చిన ఏబీ ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివరి ఓవర్‌లో డివిలియర్స్ (51; 30 బంతుల్లో 4x4, 2x6) ఒక ఫోర్ కొట్టడంతో పాటు ఇంకో రెండు పరుగులు తీసి.. అర్ధ శతకం నమోదు చేశాడు. ఆ వెంటనే మూడో బంతికి కూడా రెండో పరుగు తీయబోయి రనౌటయ్యాడు. దీంతో బెంగుళూరు చివరికి 163/5తో సరిపెట్టుకుంది.హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, శంకర్, అభిషేక్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications