Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : విజయం తర్వాత కోహ్లీ చేసిన పని వైరల్.. అనుష్కను చూస్తూ..

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చరిత్ర తిరగేస్తే.. ఆ టీంకు గ్రీన్ కలర్ డ్రెస్ పెద్దగా కలిసి రాలేదని తెలుస్తుంది. దానికితోడు కోహ్లీకి అసలు అచ్చిరాని ఏప్రిల్ 23వ తేదీన మ్యాచ్. ప్రత్యర్థేమో బలమైన రాజస్థాన్ రాయల్స్. మ్యాచ్ జరిగేది చిన్నస్వామి స్టేడియంలో. ఇక్కడ ఆర్సీబీ రికార్డు అంత గొప్పగా లేదు. వీటన్నింటికీ మించి ఆర్సీబీ టాస్ కూడా ఓడిపోయింది.

ఇన్ని ప్రతికూలతల మధ్య ఆడినా కూడా చివరకు రాజస్థాన్ రాయల్స్‌ను ఆర్సీబీ ఓడించింది. ఈ మ్యాచ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతికే విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఇలా ఏప్రిల్ 23వ తేదీన గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడం కోహ్లీకి ఇది వరుసగా రెండోసారి. గతేడాది కూడా ఇలాగే జరిగింది. అయితే ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు.

 Virat Kohli flying kisses to Anushka Sharma

బౌలింగ్ చేస్తుంది ఎవరైనా సరే.. బంతిని మాత్రం బౌండరీలకు తరలిస్తూ వేగంగా ఆడారు. కానీ వీళ్లిద్దరూ అవుటైన తర్వాత బెంగళూరు బ్యాటింగ్ లైనప్ తడబడింది. ఒక్కరంటే ఒక్క ప్లేయర్ కూడా కనీసం బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు కేవలం 189 పరుగులే చేయగలిగింది. పిచ్ నుంచి బౌలర్లకు కొంత సహకారం అందడంతో ఆర్సీబీ బౌలర్లు దాన్ని చక్కగా యూజ్ చేసుకున్నారు.

రాజస్థాన్ యువ ప్లేయర్లు దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్ చెలరేగినా కూడా.. అనూహ్యంగా పుంజుకున్న ఆర్సీబీ బౌలర్లు ఆ టీంను ఒత్తిడిలోకి నెట్టారు. చివర్లో సిరాజ్ సూపర్ బౌలింగ్ చేశాడు. అతనితోపాటు హర్షల్ పటేల్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచిన ఆనందంలో కోహ్లీ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత సంతోషంతో ఊగిపోయిన కోహ్లీ.. స్టేడియంలో నిలబడి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న భార్య అనుష్క శర్మకు ఫ్లైయింగ్ కిస్‌లు పంపించాడు. అది చూసిన అనుష్క తెగ సిగ్గు పడిపోయింది. ఆ తర్వాత వెళ్లి తోటి ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను కోహ్లీ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుష్కకు ఫ్లైయింగ్ కిస్‌లు పంపుతున్న కోహ్లీ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Story first published: Monday, April 24, 2023, 7:30 [IST]
Other articles published on Apr 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+