Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsRR : తడబడుతున్న ఆర్సీబీ.. రాజస్థాన్‌ను ఓడిస్తుందా?

సొంత మైదానంలో వరుసగా రెండు మ్యాచులు ఓడిన బెంగళూరు.. అదే స్టేడియంలో బలమైన రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం 6 మ్యాచుల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్.. ఆరో స్థానంలో ఉన్న బెంగళూరుతో తలపడనుంది. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు టీం రికార్డు అంత గొప్పగా ఏం లేదు. ఇక్కడ ఆర్‌సీబీ విజయాలు 50 శాతం కూడా లేవు.

ఈ రెండు జట్ల మధ్య కొన్ని ఆసక్తికర మ్యాచప్‌లు ఉన్నాయి. వానిందు హసరంగా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇబ్బంది పడుతున్నాడు. అలాగే రాజస్థాన్ పేసర్ సందీప్ శర్మ బౌలింగ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ తడబడతాడని గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ఈ బౌలర్లను ఈ స్టార్ క్రికెటర్లు ఎంత సమర్ధవంతంగా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

rcb rajasthan match

అంతేకాదు, బ్యాటింగ్‌కు అనుకూలించే చిన్నస్వామి స్టేడియంలో మంచి రికార్డు ఉన్న యుజ్వేంద్ర చాహల్.. తన పాత జట్టు ఆర్సీబీపై చెలరేగేందుకు రెడీ అవుతున్నాడు. దేవదత్ పడిక్కల్ కూడా ఆర్సీబీతో పేరు సంపాదించిన ప్లేయరే. వీళ్లిద్దరూ తమ పాత ఫ్రాంచైజీపై ఎలా ఆడతారని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చాహల్, పడిక్కల్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు.

రాజస్థాన్ జట్టులో వీళ్లిద్దరూ చాలా కీలకంగా మారారు. వీటితోపాటు మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రాజస్థాన్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రత్యర్థులకు తన తొలి ఓవర్లోనే షాకిస్తున్నాడు. అదే సమయంలో ప్రస్తుత ఐపీఎల్‌లో సూపర్ ఓపెనింగ్ జోడీల్లో కోహ్లీ, డుప్లెసిస్ జోడీ కూడా ఒకటి. వీళ్లిద్దరికీ బౌల్ట్ ఎలా బౌలింగ్ చేస్తాడనేది చూడాలి. అలాగే ఈ సీజన్‌లో సూపర్‌‌గా బౌలింగ్ చేస్తున్న మరో బౌలర్ మహమ్మద్ సిరాజ్.

ఈ హైదరాబాదీ పేసర్ కూడా పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతన్ని జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఎలా ఎదుర్కుంటారనేది కూడా ఆసక్తికర విషయమే. వీళ్లిద్దరూ ఇప్పటి వరకు రాజస్థాన్‌కు ఒకటి, రెండు మ్యాచులు మినహా అన్ని మ్యాచుల్లో అదిరిపోయే ఆరంభం అందించిన వారే. అయితే రెండు జట్ల బలాబలాలు పరిశీలిస్తే.. చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ గెలవడానికి అవకాశాలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Story first published: Sunday, April 23, 2023, 14:15 [IST]
Other articles published on Apr 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+